దేశ ఆర్ధిక వ్యవస్ధపై కలాంకు పూర్తి అవగాహన
న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతిగా విశిష్ట సేవలందించిన అబ్దుల్ కలాం సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. శాస్త్రవేత్త నుంచి రాష్ట్రపతిగా అత్యుత్తమ సేవలు అందించిన అబ్దుల్ కలాంకు దేశ ఆర్ధిక రంగంపై కూడా గట్టి పట్టు ఉంది.
2007లో రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో దేశ స్ధూల దేశీయోత్పత్తి (జీడీపీ) లెక్కలపే ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆరోజుల్లో జీడీపీ 9 శాతంపైగా వృద్ధి చెందుతున్నా గణంకాల పట్ల ఆయన సంతృప్తి చెందలేదు.

దేశ ఆర్ధిక వ్యవస్ధపై కలాంకు పూర్తి అవగాహన
దేశం ఆర్ధికంగా ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలను ప్రాతిపదికగా తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ఇందుకు నేషనల్ ప్రాస్పరిటీ ఇండెక్స్ ను సూచించారు.

దేశ ఆర్ధిక వ్యవస్ధపై కలాంకు పూర్తి అవగాహన
దేశ జీడీపీ, దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న వారి జీవన ప్రమాణాలు, వృద్ధుల జీవన ప్రమాణాల కలయికతో ప్రాస్పరిటీ ఇండెక్స్ ఉండాలని సూచించారు. ప్రస్తుతం సేవలు, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల ఉత్పత్తి విలువల ప్రాతిపదికన జీడీపీని లెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

దేశ ఆర్ధిక వ్యవస్ధపై కలాంకు పూర్తి అవగాహన
జీడీపీ వృద్ధి వేగం, ఆ ఫలాలు సామాన్యుడికి అందకపోతే లాభం ఉండదని ఆయన చెప్పేవారు. పట్టణాల్లో ఉన్న సౌకర్యాలు కూడా గ్రామాల్లో వచ్చినప్పుడే సంపూర్ణ వృద్ధి సాధించినట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు.
దేశ ఆర్ధిక వ్యవస్ధపై కలాంకు పూర్తి అవగాహన
దేశంలో దాదాపు 60 కోట్ల మంది వ్యవసాయంపైనే ఆధారపడ్డారని, అలాంటి వ్యవసాయ రంగ వృద్ధిపై మీడియా సైతం దృష్టి సారించాలని ఆయన సూచించారు. అత్యున్నత స్ధాయి ఆర్ధిక వృద్ధి సాధించడానికి భారత్‌కు అన్ని అవకాశాలూ, శక్తి సామర్ద్యాలూ ఉన్నాయని పలు సందర్భాల్లో ఆయన వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications