16 ఏళ్ల తర్వాత నెస్లే ఇండియా ఎండీగా ఓ భారతీయుడు

న్యూఢిల్లీ: భారత్‌లో నెస్లే ఇండియా నష్ణ నివారణ చర్యటలకు శ్రీకారం చుట్టింది. మ్యాగీ ఉదంతంతో స్విట్జర్లాండ్‌కు చెందిన నెస్లే ఇండియా కంపెనీ తన ఇండియా హెడ్‌ను తొలగించింది. ప్రస్తుతం నెస్లే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న ఇటిన్నెబెనెట్‌ను తొలగించి భారతీయుడైన సురేష్ నారాయణ్ నియమించింది.

ఈ నియామకం వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తుంది. దాదాపు 16 ఏళ్ల తర్వాత ఒక భారతీయుడిని మేనేజింగ్ డైరెక్టర్‌గా నెస్లే ఇండియా నియమించింది. పుడ్ సేప్టీ అండ్ స్టాండర్డ్స్ అధారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిషేధం కారణంగా మ్యాగీ నూడుల్స్‌ను నెస్లే కంపెనీ స్టోర్స్ నుంచి ఉపసంహరించింది.

1999లో నెస్లేలో చేరిన సురేష్ నారాయణ్ ప్రస్తుతం నెస్లే ఫిలిఫ్పేన్స్ యూనిట్‌కు సీఈఓగా పనిచేస్తున్నారు. నెస్లే కంపెనీకి చెందిన మ్యాగీ నూడుల్స్‌లో సీసం, మోనోసోడియం గ్లుటామేట్ స్థాయిలు పరిమితి కంటే ఎక్కువగా ఉన్నాయని గుర్తించిన భారత ఆహార భద్రతా ప్రమాణ సంస్థ మ్యాగీ నూడుల్స్ ను నిషేదించిన సంగతి తెలిసిందే.

 16 ఏళ్ల తర్వాత నెస్లే ఇండియా ఎండీగా ఓ భారతీయుడు

16 ఏళ్ల తర్వాత నెస్లే ఇండియా ఎండీగా ఓ భారతీయుడు

మ్యాగీ నూడుల్స్‌లో అనుమతించిన స్థాయికన్నా మించి ఆరోగ్యానికి హాని చేసే సీసం లాంటి పదార్థాలున్నట్లు శాంపిల్స్ పరీక్షలో తేలడంతో ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, హర్యానా, కర్నాటక, లాంటి అనేక రాష్ట్రాలు మ్యాగీ నూడుల్స్ అమ్మకాలపై నిషేధం విధించింది.

16 ఏళ్ల తర్వాత నెస్లే ఇండియా ఎండీగా ఓ భారతీయుడు

16 ఏళ్ల తర్వాత నెస్లే ఇండియా ఎండీగా ఓ భారతీయుడు

ఇకపై నెస్లే మ్యాగీ నూడుల్స్ నాణ్యత పరీక్షల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతుందని ఆయన ప్రకటించారు. మ్యాగీ నూడుల్స్ ప్రచారం కోసం గతేడాది సుమారు రూ.400 కోట్లకు పైగా ఖర్చు పెట్టగా, నాణ్యత పరీక్షల కోసం కేవలం రూ. 19 కోట్లు మాత్రమే మ్యాగీ ఖర్చు పెట్టింది.
16 ఏళ్ల తర్వాత నెస్లే ఇండియా ఎండీగా ఓ భారతీయుడు

16 ఏళ్ల తర్వాత నెస్లే ఇండియా ఎండీగా ఓ భారతీయుడు

భారత్‌లో ఇప్పటికే నిషేధానికి గురైన మ్యాగీ ఆహార ఉత్పత్తులను ఇతర దేశాలకు సరఫరా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ నెస్లే ఇండియా చేసిన అభ్యర్ధనకు హైకోర్టు అంగీకరిచింది. బాంబే హైకోర్టులో నెస్లే ఇండియా సంస్ధకు స్వల్ప ఊరట లభించింది. భారత్‌లో ఇప్పటికే నిషేధానికి గురైన మ్యాగీ ఆహార ఉత్పత్తులను ఇతర దేశాలకు సరఫరా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ నెస్లే ఇండియా చేసిన అభ్యర్ధనకు హైకోర్టు అంగీకరిచింది.

 16 ఏళ్ల తర్వాత నెస్లే ఇండియా ఎండీగా ఓ భారతీయుడు

16 ఏళ్ల తర్వాత నెస్లే ఇండియా ఎండీగా ఓ భారతీయుడు

భారత్ నుంచి దిగుమతి చేసుకున్న మ్యాగీ నూడుల్స్‌ ఎలాంటి హానికర రసాయనాలు లేవని సింగపూర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో మ్యాగీ నూడుల్స్‌ శాంపిల్స్‌ను పరీక్షించిన అగ్రి ఫుడ్‌ అండ్‌ వెటర్నరీ అథారిటీ ఆఫ్‌ సింగపూర్‌(ఏవీఏ) మ్యాగీ నూడుల్స్‌ని తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం కలగదని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+