జీఆర్‌టీ ఇయర్ రింగ్స్ ఫెస్టివల్: సెల్ఫీతో సరదా(ఫోటోలు)
హైదరాబాద్: తరతరాలుగా కస్టమర్లతో అనుబంధానికి మారుపేరుగా నిలిచిన దక్షిణ భారదేశ ఐకానిక్ జ్యూయలరీ బ్రాండ్ అయిన జీఅర్‌టీ జ్యూయలర్స్ గురువారం హైదరాబాద్‌లో ఇయర్ రింగ్స్ ఫెస్టివల్‌ను ప్రారంభించింది.
ఈ ఫెస్టివల్‌లో కిలో బరువు ఉండే జుంకాలను కూడా ప్రదర్శనకు ఉంచారు. ఇవన్నీ కూడా మహిళలు, వారి కుటుంబ సభ్యుల దృష్టిని ఆకట్టుకుంటాయని సంస్ధ భావిస్తోంది.

జీఆర్‌టీ ఇయర్ రింగ్స్ ఫెస్టివల్
అద్భుతమైన డిజెన్లతో సెల్ఫీ తీసుకునేందుకు సందర్శకులను అనుమతిస్తోంది. కేజీ ఇయర్ రింగ్స్‌తో తీసుకున్న సెల్ఫీలను జీఆర్‌టీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం ద్వారా కస్టమర్లు అద్బుతమైన బంగారు చెవి రింగులను బహుమతిగా పొందే అవకాశాన్ని గెలుపొందుతారు.

జీఆర్‌టీ ఇయర్ రింగ్స్ ఫెస్టివల్
ఈ సందర్భంగా జీఆర్‌టీ జ్యుయలర్స్ ఎండీ జి.ఆర్. ఆనంద్ మాట్లాడుతూ 2014 మాకెంతో ప్రత్యేకమైందన్నారు. జీఆర్‌టీ జ్యుయలర్స్ తన గోల్డెన్ యానివర్సరీని నిర్వహించుకుందన్నారు.

జీఆర్‌టీ ఇయర్ రింగ్స్ ఫెస్టివల్
అదే ఏడాది జీఆర్‌టీ జ్యుయలర్స్ మరో 2 ప్రతిష్టాత్మక అవార్డులను జైపూర్ జ్యూయలరీ షోలో పొందింది. ఇందులో ఒకటి దక్షిణ భారతదేశంలో ఈ ఏడాది అత్యుత్తమ షోరూం కాగా, రెండోది రూ. 5 లక్షల లోపు విభాగంలో బెస్ట్ ఇయర్ రింగ్ డిజైన్ అని అన్నారు.

జీఆర్‌టీ ఇయర్ రింగ్స్ ఫెస్టివల్
ఇక జీఆర్‌టీ జ్యుయలర్స్ విషయానికి వస్తే 1964లో నెలకొల్పబడి అత్యంత విశ్వసనీయ సంస్ధగా పేరుగాంచింది. స్వర్ణోత్సవ ఏడాదిలో జీఆర్‌టీ జ్యుయలర్స్ దక్షిణ భారతదేశంలో నూతన షోరూంలను ప్రారంభించింది.

జీఆర్‌టీ ఇయర్ రింగ్స్ ఫెస్టివల్
ఇటీవలే సంస్ధ దుబాయ్‌లో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. త్వరలో సింగపూర్ కూడా నూతన షోరూమ్‌ను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంది.


Click it and Unblock the Notifications