కళతప్పిన బంగారం: కొనసాగుతున్న ధరల పతనం
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుతోంది. ముంబైలోని ప్రధాన బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర రూ. 300 తగ్గి, రూ. 24,970కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే స్ధాయిలో తగ్గి రూ. 24,820కి పడిపోయింది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచడం ఖాయమన్న వార్తలతో ఇన్వెస్టర్లు బంగారం కొనుగోళ్లకు పూర్తి దూరం జరిగారు. అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా పదోరోజు కూడా బంగారం నష్టాలతో ముగిసింది. 1996 తర్వాత బంగారం ధర ఇలా వరుసగా పతనం కావడం ఇదే మొదటిసారి.
వివిధ మార్కెట్లో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ. 25,180, విజయవాడలో రూ. 25,300, ప్రొద్దుటూరులో రూ. 25,270, చెన్నైలో రూ. 25,220, ముంబైలో రూ. 24,970గా ఉంది.

కళతప్పిన బంగారం: కొనసాగుతున్న ధరల పతనం
ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ. 24,670, విజయవాడలో రూ. 23,500, ప్రొద్దుటూరులో రూ. 23,390, చెన్నైలో రూ. 23,580, ముంబైలో రూ. 24,820గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాద్‌లో రూ. 34,200, విజయవాడలో రూ. 34,400, ప్రొద్దుటూరులో రూ. 34,200, చెన్నైలో రూ. 33, 825, ముంబైలో రూ. 34,635 గా ఉంది.

కళతప్పిన బంగారం: కొనసాగుతున్న ధరల పతనం
ఇక ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధర ఆగస్టు డెలివరీ రేటు 1,091 డాలర్ల (ఔన్స్ ధర)కు చేరింది. స్పాట్ ధర ఔన్స్‌కు 1,093 డాలర్లుగా ఉంది. గోల్డ్‌మాన్ సాచ్, ఎబిఎన్ ఆమ్రో బ్యాంక్, సొసైటీ జనరల్ వంటి బ్యాంకింగ్, కన్సల్టెన్సీ సంస్థలు ఔన్స్ (31 గ్రాములు) ధర 1,000 డాలర్ల దిగువకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

కళతప్పిన బంగారం: కొనసాగుతున్న ధరల పతనం
రోజురోజుకూ ధరలు తగ్గుముఖం పడుతుండటంతో ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం అమ్మకాలు పెరిగాయి. దేశీయ మార్కెట్లోనూ బంగారం పరిస్థితి కళతప్పింది. అమ్మకాల ఒత్తిడితో ధర నాలుగేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ముంబై మార్కెట్లో 10 గ్రాముల ధర 25 వేల రూపాయల దిగువకు పడిపోయింది.

కళతప్పిన బంగారం: కొనసాగుతున్న ధరల పతనం
దీంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. 1996 తర్వాత బంగారం ధర ఇలా వరుసగా పతనం కావడం ఇదే మొదటిసారి.


Click it and Unblock the Notifications