గోపీచంద్ చేతుల మీదగా 'హ్యుందాయ్ క్రెటా' విడుదల(ఫోటోలు)
హైదరాబాద్: దేశంలో రెండో అతిపెద్ద కార్ల విక్రయ సంస్థ హ్యుందాయ్ ఇండియా క్రెటా పేరుతో సరికొత్త స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్‌ను(ఎస్‌యూవీ) మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ కారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ హాజరై హ్యుందాయ్ క్రెటా కారుని విడుదల చేశారు.
కారు విడుదల అనంతరం హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎంఐఎల్) మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ బిఎస్ సియో మాట్లాడుతూ భారత మార్కెట్లో హ్యుందాయ్ స్థానాన్ని క్రెటా మరింత పటి ష్ఠం చేస్తుందని చెప్పారు.
ఫోర్డ్ ఎకోస్పోర్ట్, రెనో డస్టర్, నిస్సాన్ టెర్రానో, మహీంద్రా స్కార్పియో, మహీంద్రా ఎక్స్‌యూవీ500, టాటా సఫారీ స్టార్మ్‌కు పోటీగా హ్యుందాయ్ క్రెటాను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాహన ప్రవేశంతో ఇండియా మార్కెట్లో సంస్థ స్థానం మరింత బలోపేతం అవుతుందన్నారు.
భారత్ నుంచి అంతర్జాతీయ మార్కెట్లోకి హ్యుందాయ్ విడుదల చేసిన తొలి వాహనం క్రెటా కావటం విశేషం. హ్యుందాయ్‌కు భారత మార్కెట్ ఎంతో కీలకంగా ఉందని అందుకనుగుణంగానే ఐదు సీట్లతో కూడిన ఎస్‌యువి క్రెటాను తొలుత ఇక్కడ విడుదల చేసినట్లు ఆయన చెప్పారు.

గోపీచంద్ చేతుల మీదగా 'హ్యుందాయ్ క్రెటా' విడుదల
హ్యుందాయ్ మోటార్స్‌కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లు ఎంతో కీలకంగా ఉన్నాయని కంపెనీ ఎపి, తెలంగాణ రీజినల్ మేనేజర్ విక్రమ్ జునేజా చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని లక్ష్మి హ్యుందాయ్‌లో క్రెటాను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో క్రెటాకు 500కు పైగా ప్రీ బుకింగ్‌లు రావడమే ఇందుకు నిదర్శనమని అన్నారు.

గోపీచంద్ చేతుల మీదగా 'హ్యుందాయ్ క్రెటా' విడుదల
నెలాఖరు కల్లా బుకింగ్‌ల సంఖ్య 1,000కి చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. క్రెటా డెలివరీకి రెండు నుంచి మూడు నెలలు పట్టవచ్చని భావిస్తున్నట్లు జునేజా పేర్కొన్నారు. హైదరాబాద్‌లో క్రెటా పెట్రోల్ వేరియంట్ ధర రూ. 8,74,840 నుంచి రూ. 11,39,451 కాగా డీజిల్ వేరియంట్ ధరలు రూ. 9,63,774 నుంచి రూ. 13,84,337 మధ్యన ఉన్నాయని చెప్పారు.

గోపీచంద్ చేతుల మీదగా 'హ్యుందాయ్ క్రెటా' విడుదల
క్రెటా 1.6 లీటర్ పెట్రోల్ వేరియంట్ల ధర రూ.8.59 లక్షల నుంచి రూ.11.19 లక్షల మధ్య ఉండగా.. 1.4 లీటర్ డీజిల్ వేరియంట్లు రూ.9.46 లక్షల నుంచి రూ.11.45 లక్షల మధ్య లభించనున్నాయి. ఇక 1.6 లీటర్ డీజిల్ వేరియంట్ల రేటును రూ.11.59 లక్షల నుంచి రూ.13.6 లక్షల మధ్యలో నిర్ణయించారు.

గోపీచంద్ చేతుల మీదగా 'హ్యుందాయ్ క్రెటా' విడుదల
ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్‌తోపాటు దాదాపు అన్ని సెగ్మెంట్లలో వాహనాలను అందుబాటులోకి తెచ్చిన హ్యుందాయ్, ఇండియా మార్కెట్లో శరవేగ వృద్ధి నమోదు చేసుకుంటున్న మాస్ ఎస్‌యూవీ మోడల్ సెగ్మెంట్లోకి మాత్రం మిగతా సంస్థల కంటే కాస్త ఆలస్యంగానే ప్రవేశించింది.


Click it and Unblock the Notifications