టాటా స్కై సక్సెస్ మీట్: మహేశ్ ఏమన్నారు? (ఫోటోలు)
డీటీహెచ్ రంగంలో 2015-16లో కొత్తగా ఒక కోటి మంది కస్టమర్లు వచ్చి చేరతారని టాటా స్కై అంచనా వేస్తోంది. నాణ్యమైన చిత్రం, ఉత్తమ సర్వీసు, అనుకూలమైన ధరలో విభిన్నమైన ప్యాక్‌ల కారణంగా డీటీహెచ్‌ను ఎంచుకునేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని టాటా స్కై చీఫ్ సేల్స్ ఆఫీసర్ సలీమ్ షేక్ సోమవారం తెలిపారు.
'దేశవ్యాప్తంగా 14 కోట్ల టీవీ గృహాలున్నాయి. కేబుల్ చందాదారులు 8-8.5 కోట్లు, డీటీహెచ్ చందాదారులు 4.1 కోట్ల మంది ఉన్నారు. కేబుల్ నుంచి డీటీహెచ్‌కు మళ్లుతున్నవారి శాతం ఏటా 6-8 శాతంగా ఉంది. డిజిటైజేషన్‌కు అనుగుణంగా ఇది మరింత పెరుగుతుంది' అని తెలిపారు.

టాటా స్కై సక్సెస్ మీట్: మహేశ్ ఏమన్నారు?
కేబుల్ వినియోగదార్లలో 6-7 శాతం మంది ఏటా డీటీహెచ్ కనెక్షన్‌కు మారుతున్నారని, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4 కోట్ల మంది డీటీహెచ్ చందాదారులు ఉన్నారని వివిరంచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చందాదారులను ఆకర్షించడంలో అగ్రగామిగా టాటా స్కై ఉందని చెప్పారు.

టాటా స్కై సక్సెస్ మీట్: మహేశ్ ఏమన్నారు?
ఈ ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు పరిశ్రమ 10-12 శాతం నమోదు చేస్తే, టాటా స్కై 20 శాతం అంచనా వేస్తోందన్నారు. రాష్ట్రాల్లో కొత్తగా డీటీహెచ్ కనెక్షన్లు తీసుకుంటున్న ప్రతి ముగ్గురిలో ఒకరు టాటా స్కై కనెక్షనే తీసుకుంటున్నారని సలీమ్ తెలిపారు.
టాటా స్కై సక్సెస్ మీట్: మహేశ్ ఏమన్నారు?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద పట్టణాల్లో 40 శాతంపైగా మార్కెట్ వాటా సాధించామని చెప్పారు. ఇక కొత్త కస్టమర్లలో హెచ్‌డీ కోరుకునేవారు పరిశ్రమలో 15 శాతం కాగా, టాటా స్కై విషయంలో 40-45 శాతం ఉంటున్నారని తెలిపారు. సర్వీసింగ్‌కు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు.

టాటా స్కై సక్సెస్ మీట్: మహేశ్ ఏమన్నారు?
తెలంగాణ, ఏపీలో అగ్రశ్రేణి కంపెనీగా నిలిచిన సందర్భంగా నిర్వహించి సక్సెస్ మీట్‌లో బ్రాండ్ అంబాసిడర్, సినీ నటుడు మహేశ్ బాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్ బాబు మాట్లాడుతూ టాటా స్కై బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం సంతోషంగా ఉందని అన్నారు.


Click it and Unblock the Notifications