ప్రభుత్వ ప్రాజెక్టుల్లో ఇన్ఫోసిస్ నష్టపోయింది: మూర్తి(ఫోటోలు)
న్యూఢిల్లీ: ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రాజెక్టుల్లో పాలుపంచుకున్న ప్రతిసారీ తమ సంస్ధ నష్టపోయిందని ఇన్ఫోసిస్ సహా వ్వవస్ధాపకుడు ఎన్.ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులు ప్రారంభమైన తర్వాత మార్పులు చేర్పులు జరగడం, చెల్లింపులు ఆలస్యం అవడం లాంటివి ఇబ్బందిగా మారాయని, అంతర్జాతీయ స్ధాయి నిబంధనలు అమలు కావడం లేదని అన్నారు.
ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఆయన డిజిటల్ ఇండియా విజయవంతం కావాలంటే, ఆ పరిస్ధితి మారాలని అన్నారు. 'ఇన్ఫోసిస్ గురించి నాకు తెలుసు. అది ఏ ఒక్క ప్రభుత్వ ప్రాజెక్టులో కూడా డబ్బు నష్ట పోకుండా పూర్తవలేదు' అని ఆయన అన్నారు.

ప్రభుత్వ ప్రాజెక్టుల్లో ఇన్ఫోసిస్ నష్టపోయింది: మూర్తి
సరైన సమయానికి సాంకేతికత లభ్యం కాకపోవడం, లంచగొండితనం భారత ఐటీ సంస్ధలను పట్టి పీడిస్తున్నాయని ఆయన తెలిపారు. వీటన్నింటిని పరిష్కరిస్తే, డిజిటల్ ఇండియాను విజయవంతం చేయడంలో మొత్తం ఐటీ పరిశ్రమ ప్రభుత్వం వెనుక నిలుస్తుందనడంలో సందేహం లేదని అన్నారు.

ప్రభుత్వ ప్రాజెక్టుల్లో ఇన్ఫోసిస్ నష్టపోయింది: మూర్తి
ఇన్ఫోసిస్‌తో పలు రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన హెల్త్ కేర్, ఈ గవర్నెన్స్, అగ్రికల్చర్ తదితర రంగాల్లో వివిధ ప్రాజెక్టులను చేపట్టింది. ప్రభుత్వ విధానం మారితేనే పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ప్రభుత్వంతో చేతులు కలిపేందుకు ముందుకు వస్తాయని అన్నారు.

ప్రభుత్వ ప్రాజెక్టుల్లో ఇన్ఫోసిస్ నష్టపోయింది: మూర్తి
కంపెనీలకు, ప్రభుత్వాలకు సానుకూలంగా ఉండేలా ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచించారు. డిజిటల్ ఇండియా ప్రాజెక్టుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలిపారు. మా నిపుణులకు తగినంత సమయం ఇస్తే సమస్యను పరిష్కరిస్తారని అన్నారు.

ప్రభుత్వ ప్రాజెక్టుల్లో ఇన్ఫోసిస్ నష్టపోయింది: మూర్తి
డిజిటల్ ఇండియా ఊపందుకుంటే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించడంలో డిజిటల్ ఇండియా కీలకం కానుందని నారాయణ మూర్తి పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications