కుంగిన రియల్టీ: తగ్గనున్న ఇంటి ధరలు?(ఫోటోలు)
గత 8 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేనంత విధంగా నోయిడాలో రియల్టీ రంగం కుదేలైందని బ్యాంక్ అఫ్ అమెరికా పేర్కొంది. భారీగా పెరిగిన ధరలు, బ్యాంకు రుణాలు తగ్గుముఖం పట్టడం లాంటి పరిణామాలు మెట్రో నగరాల్లో రియల్టీ వ్వాపారాన్ని కుంగదీశాయని ప్రముఖ అమెరికన్ బ్రోకరేజ్ సంస్ధ బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిల్ ఇంచ్ పేర్కొంది.
ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో కేవలం 3,800 ఇళ్లు మాత్రమే అమ్మకాలు జరిగాయంటే రియల్టీ రంగం ఎంత మందగించిందో అర్ధమవుతుంది. ఆర్‌బీఐ హౌజింగ్ సూచీ కూడా దేశీయ రియల్టీ రంగంలో మందగమనాన్నీ, ధరల తగ్గుదలను చూపిస్తోంది.

నోయిడా: 8 ఏళ్ల అత్యల్పానికి హౌసింగ్ సేల్స్
అయితే ప్రాపర్టీ వెబ్‌సైట్స్ నుంచి సేకరించిన డేటాను బట్టి చూస్తే గత ఏడాదితో పోలిస్తే, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణె, కోల్‌కతా నగరాల్లో స్థిరాస్తుల ధరలు 7-18 శాతం తగ్గినట్టు నివేదికలో వెల్లడించింది.

నోయిడా: 8 ఏళ్ల అత్యల్పానికి హౌసింగ్ సేల్స్
ముంబై రియల్టీ పరిస్థితి మరీ దారుణంగా ఉందని నివేదిక తయారు చేసిన ఎనలిస్టులు సౌరభ్ ముఖర్జీ, సుమిత్ శేఖర్ వెల్లడించారు. ముంబైలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల నుంచి ప్రాపర్టీ కన్సల్టెంట్స్ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం, రియల్టీ లావాదేవీలు కనీసం 15 శాతం వరకు తగ్గినట్టుగా చెబుతున్నారు.

నోయిడా: 8 ఏళ్ల అత్యల్పానికి హౌసింగ్ సేల్స్
ముంబై, ఢిల్లీ రాజధాని ప్రాంతాల్లో పేరుకుపోయిన ఇన్వెంటరీలు క్లియర్ కావాలంటే కనీసం మూడేళ్ల నుంచి నాలుగేళ్లు పడుతుందని అంచనా. ఈ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలన్నీ లబోదిబోమంటున్నాయి. ముంబైలో 77,460 అపార్ట్‌మెంట్లు కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి.

నోయిడా: 8 ఏళ్ల అత్యల్పానికి హౌసింగ్ సేల్స్
వీటిలో పూర్తయిన వాటికంటే వివిధ దశల్లో ఉన్నవే ఎక్కువ. దేశవ్యాప్తంగా కొత్త ప్రాజెక్టులు కూడా ఎక్కువగా రావడం లేదు. కొత్త ప్రాజెక్టుల పరిమాణం 80 శాతం వరకు పతనమైంది. రియల్టీలో మందగమనానికి సిమెంట్ ఉత్పత్తి ఎంతో కీలకం. ఇటీవల కాలంలో సిమెంట్ ఉత్పత్తి గణనీయంగా తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

నోయిడా: 8 ఏళ్ల అత్యల్పానికి హౌసింగ్ సేల్స్
నల్లధనం చట్టంలో మార్పుల నేపథ్యంలో సంపన్నులు భారీ స్థాయిలో ఆస్తుల కొనుగోళ్లకు దూరంగా ఉంటున్నారు. దేశీయంగా నల్లధనం చెలామణికి రియల్టీనే మంచి రంగం. ఈ చట్టం దెబ్బకు కనీసం లక్ష మంది ఇప్పటికే దుబాయ్ వంటి దేశాల్లో పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్నట్టుగా చెబుతున్నారు.

నోయిడా: 8 ఏళ్ల అత్యల్పానికి హౌసింగ్ సేల్స్
అభివృద్ధి చెందిన దేశాల్లో స్థిరాస్తులపై లభించే అద్దెకు, బ్యాంకు రుణాల రేట్లకు మధ్య సంబంధం ఉంటుంది. భారత్‌లో మాత్రం అలాంటి పరిస్థితి ఉండదు.


Click it and Unblock the Notifications