ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అద్భుత ఫలితాలను నమోదు చేసింది. గడచిన 15 త్రైమాసికాల్లో ఎన్నడూ లేనంతగా ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో 4.5 శాతం డాలర్ రెవెన్యూ వృద్ధిని సాధించింది.
ఇదే సమయంలో వాల్యూమ్ పరంగా సంస్ధ 19 త్రైమాసికాల తర్వాత అత్యధికంగా 5.4 శాతం వృద్ధిని సాధించింది. ఈ ఫలితాలు ఇన్ఫోసిస్ పోటీదారుగా ఉన్న టీసీఎస్ ఫలితాలతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉండటం ఇన్వెస్టర్లకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

ఇన్ఫోసిస్ షేర్ విలువ ఆమాంతం పెరిగింది
కాగా ఈ సంవత్సరం వార్షిక అమ్మకాల అంచనా భారత కరెన్సీలో 10 నుంచి 12 శాతం పెరగవచ్చని, డాలర్లలో 7.2 నుంచి 9.2 శాతం పెరగుతుందని భావిస్తున్నామని సంస్ధ సీఓఓ యుబీ ప్రవీణ్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.

ఇన్ఫోసిస్ షేర్ విలువ ఆమాంతం పెరిగింది
సంస్ధ ఫలితాలను రూపాయిల్లో గణాంకాలను పరిశీలిస్తే, సంస్ధ నికర లాభం రూ. 3,030 కోట్లకు, ఆదాయం రూ. 14,354 కోట్లకు చేరాయి. ఫలితాలు వెల్లడించక ముందు మార్కెట్ నిపుణులు సంస్ధ నికర లాభం రూ. 3,019 కోట్లకు, ఆదాయం రూ. 14,066 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు.
ఇన్ఫోసిస్ షేర్ విలువ ఆమాంతం పెరిగింది
అంచనాలకు మించిన ఫలితాలను నమోదు చేసింది. దీంతో ఈ త్రైమాసికంలో కొత్తగా 79 క్లయింట్ల నుంచి కాంట్రాక్టులు లభించాయని ఇన్ఫోసిస్ ప్రకటించింది.

ఇన్ఫోసిస్ షేర్ విలువ ఆమాంతం పెరిగింది
దీంతో స్టాక్ మార్కెట్లలో ఇన్ఫోసిస్ ఈక్విటీ విలువ ఒక్కసారిగా పెరిగింది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇన్ఫోసిస్ ఈక్విటీ షేర్ విలువ 11శాతం పెరిగి రూ. 1,116 వద్ద కొనసాగుతోంది.More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications