అంతర్జాతీయ మార్కెట్లో బంగారంతో పాటు ప్లాటినం ధరలు ఐదేళ్ల కనిష్టానికి పడిపోయాయి. యూఎఫ్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచవద్దన్న అంచనాలతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బులియన్ మార్కెట్ నుంచి వెనక్కి తీసుకుని బాండ్లలో పెడుతుంటడమే ధరల పతనానికి ప్రధాన కారణం.
ఇక ఇండియాలో బంగారు అమ్మకాలు అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ, బంగారం ధరలు అంతర్జాతీయ స్ధాయితో పోలిస్తే ఎక్కువగానే ఉన్నాయి. ముంబై బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి ధర రూ. 26,000 తక్కువకే దిగొచ్చింది.

ఐదేళ్ల కనిష్టానికి బంగారం ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,106.90 డాలర్ల వద్ద ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది 2.4 శాతం తక్కువ. మార్చి 2010లో 1,008 డాలర్ల వద్ద ఉన్న బంగారం ధర తిరిగి అదే స్ధాయికి వెళ్లడం ఇదే తొలిసారి.

ఐదేళ్ల కనిష్టానికి బంగారం ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కో గ్రాము సుమారు 36 డాలర్లకు లభిస్తుండగా, ఇండియాలో మాత్రం గ్రాము బంగారం రూ. 2300కు లభించాలి. కానీ భారత్‌లో మాత్రం రూ. 2,600కు గ్రాము బంగారం లభిస్తుంది.

ఐదేళ్ల కనిష్టానికి బంగారం ధరలు
అందుకు కారణం దిగుమతి చేసుకునే బంగారంపై కేంద్రం విధించిన 10 శాతం కస్టమ్స్ సుంకం, ఒక శాతం వ్యాట్, దిగుమతి చార్జీలు, ఇతర ఖర్చులు కలుపుకుని 12 శాతం వరకూ వినియోగదారులపై భారం పడుతోంది.

ఐదేళ్ల కనిష్టానికి బంగారం ధరలు
ప్రస్తుతం భారత్‌లో పది గ్రాముల బంగారం ధర రూ. 26,000గా ఉంది. వరుసగా మూడో సంతవ్సరంలోనూ బంగారం ధర తగ్గుదల బాటలోనే నడుస్తోంది. సమీప భవిష్యత్తులో ధరలు మరింతగా తగ్గవచ్చిని నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరల పెరుగుదలపై UBS సంచలన నివేదిక.. పసిడి పెట్టుబడిదారులకు పండగే పండగ..

వెండి ధర రూ. 3 లక్షలు.. బంగారం ధర 10 గ్రాములు రూ. 1. 72 లక్షలు.. షాకిస్తున్న ఆర్థిక నిపుణులు అంచనాలు..

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

బంగారం ధరలు తగ్గినా.. లాభాలు రావాలంటే ఈ రేటుకు దిగేదాకా ఆగాల్సిందే.. ఆర్థిక నిపుణులు కీలక సూచన..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం ధరలు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: బంగారం, వెండి ధరలు ఈ రోజు భారీగా పతనం.. ధరలు ఎలా ఉన్నాయో చెక్ చేయండి

బంగారం ధరలు ఈ వారం పెరుగుతాయా..తగ్గుతాయా.. ఆ మూడు ప్రపంచ బ్యాంకుల మీటింగ్‌పై నిపుణులు ఏం చెబుతున్నారంటే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

Gold rates: పెరిగిందా.. తగ్గిందా? దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి గోల్డ్ రేట్ల వివరాలు ఇవే..

భవిష్యత్తులో బంగారం అయిపోతుందా.. మైనింగ్ తవ్వకం తరువాత ఏమి మిగలదా..పసిడి కొరతపై క్లారిటీ ఇదిగో..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు ఎంత తగ్గిందో తెలిస్తే ఎగిరి గంతేయాల్సిందే.. మార్చి 12, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications