హీరో గ్లామర్ బైక్ అంటే ఎంతో ఇష్టం: అల్లు అర్జున్(ఫోటోలు)
హైదరాబాద్: దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థల్లో ఒకటైన హీరో మోటోకార్ప్ తమ సరికొత్త ‘ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్', ‘ప్యాషన్ ప్రో' బైక్‌లను గురువారం హైదరాబాద్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ ఏడాది 8-10 శాతం వృద్ధి ఆశిస్తోందని హీరో మోటోకార్ప్ తెలిపింది.
ఈ సందర్భంగా కంపెనీ సౌత్ జోనల్ హెడ్ మహేశ్ హీరేమత్ మాట్లాడుతూ ప్రస్తుతం భారత్‌లో 18 మోడళ్లను విక్రయిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని మోడళ్లు ఈ ఏడాది రానున్నాయని వివరించారు. 50 శాతం వాటాతో దేశంలో అగ్రస్ధానంలో ఉన్నట్లు వెల్లడించారు.

హీరో గ్లామర్ బైక్ అంటే ఎంతో ఇష్టం: అల్లు అర్జున్
దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థల్లో ఒకటైన హీరో మోటోకార్ప్ తమ సరికొత్త ‘ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్', ‘ప్యాషన్ ప్రో' బైక్‌లను గురువారం హైదరాబాద్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది.

హీరో గ్లామర్ బైక్ అంటే ఎంతో ఇష్టం: అల్లు అర్జున్
తెలంగాణ, ఏపీ ప్రతి నెలా 90,000- 95,000 బైక్‌లు అమ్ముడవుతున్నాయని చెప్పారు. ఇప్పటికే తెలంగాణలో 300, ఆంధ్రప్రదేశ్‌లో 300 టచ్ పాయింట్లు (డీలర్‌షిప్‌లు సహా) ఉన్నాయని, ఈ ఏడాదిలో వీటి సంఖ్యను మరో 10 శాతం పెంచుకుంటామని ఆయన తెలిపారు.

హీరో గ్లామర్ బైక్ అంటే ఎంతో ఇష్టం: అల్లు అర్జున్
దక్షిణాదిలో ఎపి, తెలంగాణ మార్కెట్లు హీరోకు చాలా కీలకమైనవని అని పేర్కొన్నారు. హైదరాబాద్ మార్కెట్లో (ఎక్స్ షోరూమ్) 150 సిసి సామర్ధ్యం కలిగిన ఇంజన్, ధృఢమైన బాడీతో ప్రవేశపెట్టిన ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ బైక్ ధర రూ. 71,729గా నిర్ణయించారు.

హీరో గ్లామర్ బైక్ అంటే ఎంతో ఇష్టం: అల్లు అర్జున్
100 సిసి ఇంజన్‌తో మరింత ఆకర్షణీయంగా ప్రవేశపెట్టిన ‘ప్యాషన్ ప్రో' ధరను 49,450 (ఎక్స్-షోరూమ్) రూపాయలు గానూ నిర్ణయించినట్లు ఆ సంస్థ ప్రకటించింది.

హీరో గ్లామర్ బైక్ అంటే ఎంతో ఇష్టం: అల్లు అర్జున్
ప్యాషన్ ప్రో ఎనిమిది రంగుల్లో, ఎక్స్‌ట్రీమ్ ఐదు రంగుల్లో లభిస్తుంది. కస్టమర్ల అభిరుచులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయని, ఈ నేపథ్యంలో ఎక్కువ ఆదరణ లభిస్తున్న బైక్‌ల్లో సరికొత్త ఫీచర్లను జోడిస్తున్నట్టు తెలిపారు.

హీరో గ్లామర్ బైక్ అంటే ఎంతో ఇష్టం: అల్లు అర్జున్
ఈ రెండు బైక్‌లను హీరో మోటోకార్ప్ బ్రాండ్ అంబాసిడర్, టాలీవుడ్ హీరో ‘స్టైలిష్ స్టార్' అల్లు అర్జున్ ఆవిష్కరించాడు.

హీరో గ్లామర్ బైక్ అంటే ఎంతో ఇష్టం: అల్లు అర్జున్
అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఈ బైక్‌లు యువతను ఎక్కువగా ఆకర్షించే అవకాశం ఉందని చెప్పారు. తాను కూడా ఈ బైక్‌లపై రైడింగ్‌కు వెళ్లానన్నారు. హీరో గ్లామర్ బైక్ అంటే తనకు ఎక్కువ ఇష్టమని తెలిపారు.


Click it and Unblock the Notifications