చెన్నై: అన్నివర్గాల వారికి అందుబాటు ధరల్లో కారు అందించాలన్న తపనలో ప్రజల కోసం తాము తయారుచేసిన 'టాటా నానో' కారు మార్కెటింగ్‌లో చేసిన పొరపాట్ల వల్లనే అది అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయిందని బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్‌టాటా పేర్కొన్నారు.
చెన్నైలోని గ్రేట్ లేక్స్ ఇన్‌స్టిట్యూట్ 11వ స్నాతకోత్సవంలో పాల్గొన్న రతన్ టాటా మాట్లాడుతూ అమెరికాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సాంప్రదాయిక వ్యాపార ధోరణులకు అతీతంగా ఆలోచించినందువల్లనే ఈ రోజు ఆపిల్, ఫేస్‌బుక్ వంటి కంపెనీలు ప్రపంచాన్ని ఏలుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

నానోపై రతన్ టాటా: 'మేం చేసిన పెద్ద తప్పు'
ఇ-కామర్స్, ఇ-రిటైలింగ్ విభాగంలోని ఔత్సాహిక స్టార్టప్ కంపెనీల్లోనే తనకు భారతదేశం భవిష్యత్తు కనిపిస్తుందని పేర్కొన్న రతన్ టాటా వారికి అవసరమైన ప్రోత్సాహం ఇచ్చేందుకు అందివచ్చిన అవకాశంగా భావించి తాను ఆ విభాగాల్లో ఎక్కువగా పెట్టుబడి పెట్టినట్లు ఆయన చెప్పారు.

నానోపై రతన్ టాటా: 'మేం చేసిన పెద్ద తప్పు'
తాను స్టార్టప్ కంపెనీల కోసం ఏంజెల్ ఫండింగ్ వంటి ఏర్పాట్లు చేయడంలేదని, ఆయా విభాగాల్లో అప్పటికే తమకంటూ కొంత గుర్తింపు తెచ్చుకున్న కంపెనీల్లోనే మాత్రమే పెట్టుబడులు పెట్టానని తెలిపారు. సృజనాత్మకత, కొత్త ఆలోచనా ధోరణులున్నప్పటికీ సరైన మద్దతు కొరవడిన అలాంటి కంపెనీలకు తగు ప్రోత్సాహం ఇవ్వాలని తాను భావించానని చెప్పారు.

నానోపై రతన్ టాటా: 'మేం చేసిన పెద్ద తప్పు'
ఇక రతన్ టాటా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన టాటా నానో భారత్ మార్కెట్లో ఎందుకు విఫలమైందో కూడా తెలిపారు. దేశంలో అన్ని వర్గాల వారికి అందుబాటులో ధరలో కారు అందించాలన్న ఉద్దశ్యంతో తాము తయారుచేసిన నానో కారు మార్కెటింగ్‌లో చేసిన పొరపాట్ల వల్లే అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయిందని తెలిపారు.

నానోపై రతన్ టాటా: 'మేం చేసిన పెద్ద తప్పు'
నానో కారు మార్కెటింగ్, విక్రయాల పరంగా బోలెడన్ని తప్పులు చేశామని అన్నారు. ‘అందరికీ అందుబాటులో ఉండే కారు'కు బదులు ‘చీప్ కారు' అని ప్రచారం చేయడం మేం చేసిన పెద్ద తప్పిదమని ఆయన అన్నారు.

నానోపై రతన్ టాటా: 'మేం చేసిన పెద్ద తప్పు'
ఆ మాట ప్రతికూల ప్రభావం చూపింది. దీనివల్ల ప్రజలు నానోకు దూరమయ్యారు. ‘చీప్' కారు కొనాలని వారు అనుకోలేదు. కారు మార్కెట్లోకి ప్రవేశపెట్టడంలో ఏడాది ఆలస్యం కావడంతో పోటీదారులు తమకు అనుకూలంగా మలచుకుని నానోపై లేని పోని అపోహలతో కూడిన కథనాలు ప్రచారంలోకి తెచ్చారని ఆయన చెప్పారు.

నానోపై రతన్ టాటా: 'మేం చేసిన పెద్ద తప్పు'
దీంతో ప్రజల కోసం తయారు చేసిన నానో కారు, ప్రజల్లోకి చేరలేదని అన్నారు. 25 నుంచి 26 సంవత్సరాల సగటు వయసులోని ఔత్సాహికుల బృందమే ఆ కారు డిజైనింగ్ చేసిందని ఆయన చెప్పారు.

నానోపై రతన్ టాటా: 'మేం చేసిన పెద్ద తప్పు'
అలాంటి అద్భుతాన్ని ఆవిష్కరించిన వారి శ్రమ అంతా ఒక బెంగాల్ ‘ఆడపులి' వల్ల వృధా ప్రయాస అయిందని, బెంగాల్ నుంచి ఆ ప్లాంట్‌ను తరలించి గుజరాత్‌లోని సనంద్‌లో ఉత్పత్తి ప్రారంభించడంలో ఏడాది జాప్యం జరిగిందన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications