ఫ్లిప్‌కార్ట్ ఆఫర్: పిల్లలను దత్తత తీసుకుంటే 50వేల భత్యం
ఆన్‌లైన్ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, వినూత్న ఆఫర్లతో కస్టమర్లనే కాకుండా తన ఉద్యోగులనూ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే కొన్ని పాలసీలను ఇప్పటికే సడలించిన ఫ్లిప్‌కార్ట్ తాజాగా పిల్లలను దత్తత తీసుకోవాలని భావించే ఉద్యోగులకు రూ. 50వేల భత్యాన్ని దత్తత అలెవెన్స్ కింద చెల్లించేందుకు ముందుకొచ్చింది.
ఈ అలెవెన్స్‌లు జులై 10 నుంచి అమల్లోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. పిల్లల్ని దత్తత తీసుకునే క్రమంలో న్యాయపరమైన లేదా ఇతరత్రా ఖర్చుల కోసం భత్యం మొత్తాన్ని వినియోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్: పిల్లలను దత్తత తీసుకుంటే 50వేల భత్యం
ఆన్‌లైన్ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, వినూత్న ఆఫర్లతో కస్టమర్లనే కాకుండా తన ఉద్యోగులనూ ఆకట్టుకుంటుంది. మాతృత్వ, పితృత్వ సెలవులకు సంబంధించిన పాలసీలను ఇప్పటికే సడలించిన ఫ్లిప్‌కార్ట్ తాజాగా పిల్లలను దత్తత తీసుకోవాలని భావించే ఉద్యోగులకు రూ. 50వేల భత్యాన్ని దత్తత అలెవెన్స్ కింద చెల్లించేందుకు ముందుకొచ్చింది.

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్: పిల్లలను దత్తత తీసుకుంటే 50వేల భత్యం
ఈ అలెవెన్స్‌లు జులై 10 నుంచి అమల్లోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. పిల్లల్ని దత్తత తీసుకునే క్రమంలో న్యాయపరమైన లేదా ఇతరత్రా ఖర్చుల కోసం భత్యం మొత్తాన్ని వినియోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్: పిల్లలను దత్తత తీసుకుంటే 50వేల భత్యం
కంపెనీ మహిళా ఉద్యోగులు 12 నెలల లోపు వయసున్న పిల్లలను దత్తత తీసుకుంటే వారికి అలవెన్సుతో పాటు మెటర్నిటీ పాలసీ కింద అందించే ఆరు నెలల పెయిడ్ లీవ్, 4 నెలల ప్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ వంటి సౌకర్యాలు వర్తిస్తాయి.

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్: పిల్లలను దత్తత తీసుకుంటే 50వేల భత్యం
ఒక ఏడాదిపైనున్న పిల్లలను దత్తత తీసుకుంటే 3 నెలల పెయిడ్ లీవ్, 4 నెలల ప్లిక్సిబుల్ వర్కింగ్ అవర్స్ లాంటి సౌకర్యాలు అందుతాయి.

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్: పిల్లలను దత్తత తీసుకుంటే 50వేల భత్యం
మహిళలే కాదు, మగవారు కూడా పిల్లలను దత్తత తీసుకుంటే వారు కూడా దాదాపుగా ఇలాంటి సౌకర్యాలనే పొందవచ్చు. వీటితో పాటు ఇంకా కావాలంటే మూడు నెలల వరకు తీసుకోవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్: పిల్లలను దత్తత తీసుకుంటే 50వేల భత్యం
ఇటీవలే మాతృత్వ, పితృత్వ సెలవులకు సంబంధించిన పాలసీలను ప్లిప్‌కార్ట్ సవరించింది. ఈ సవరణలు జులై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. సవరించిన మెటర్నిటీ పాలసీ ప్రకారం కంపెనీ ఉద్యోగుల్లో తొలిసారి తల్లులైన మహిళలకు ఆరు నెలలు పెయిడ్ లీవ్స్‌ను, వేతనంతో కూడిన 4 నెలల ప్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్‌ను ఇస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ ఆఫర్: పిల్లలను దత్తత తీసుకుంటే 50వేల భత్యం
అంతేకాదు ఇంకా అవసరమైతే ఏడాది పాటు వరకు వేతనం లేకుండా కేరీర్ బ్రేక్ తీసుకునే వెసులుబాటుని ప్లిప్‌కార్ట్ సంస్ధ కల్పించింది.

Click it and Unblock the Notifications