హైదరాబాద్: విమాన ప్రయాణికులకు తమ సంస్థ ద్వారా మెరుగైన సేవలు అందిస్తామని ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి కుమారుడు, ట్రూజెట్(టర్బో మెగా ఎయిర్‌వేస్) విమానయాన సంస్థ డైరెక్టర్, బ్రాండ్ అంబాసిడర్ రాంచరణ్ తెలిపారు. ట్రూజెట్ విమానయాన సంస్థ ద్వారా రాంచరణ్ ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టారు.
ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాంచరణ్ మాట్లాడారు. జులై 12న హైదరాబాద్, తిరుపతి, రాజమండ్రికి ట్రూజెట్ విమాన సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు. తొలి విమానం హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరుతుందని తెలిపారు.

రాంచరణ్ తేజ్
విమాన ప్రయాణికులకు తమ సంస్థ ద్వారా మెరుగైన సేవలు అందిస్తామని ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి కుమారుడు, ట్రూజెట్(టర్బో మెగా ఎయిర్‌వేస్) విమానయాన సంస్థ డైరెక్టర్, బ్రాండ్ అంబాసిడర్ రాంచరణ్ తెలిపారు.

రాంచరణ్ తేజ్
ట్రూజెట్ విమానయాన సంస్థ ద్వారా రాంచరణ్ ఏవియేషన్ రంగంలోకి అడుగుపెట్టారు.

రాంచరణ్ తేజ్
ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాంచరణ్ మాట్లాడారు.

రాంచరణ్ తేజ్
జులై 12న హైదరాబాద్, తిరుపతి, రాజమండ్రికి ట్రూజెట్ విమాన సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు. తొలి విమానం హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరుతుందని తెలిపారు.

రాంచరణ్ తేజ్
ఆ తర్వాత విజయవాడ, విశాఖపట్నం, షిర్డీలకు కూడా తమ విమాన సర్వీసులు ఉంటాయని చెప్పారు. జులై 15 నుంచి చెన్నై-రాజమండ్రి సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు.
ఆ తర్వాత విజయవాడ, విశాఖపట్నం, షిర్డీలకు కూడా తమ విమాన సర్వీసులు ఉంటాయని చెప్పారు. జులై 15 నుంచి చెన్నై-రాజమండ్రి సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు. త్వరలోనే హైదరాబాద్-ఔరంగాబాద్ మధ్య సర్వీసులు నడుతామని రాంచరణ్ తెలిపారు.
తాను ట్రూజెట్ సంస్థలో డైరెక్టర్‌గా, అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. తమ విమానయాన సంస్థలో కంఫర్ట్, టైమింగ్, బెస్ట్ ఫుడ్, అన్ని సౌకర్యాలు ఉంటాయని చెప్పారు. ఏ ఇతర విమానయాన సంస్థలకు తీసిపోని విధంగా సౌకర్యాలు ఉంటాయని రాంచరణ్ తెలిపారు.
65ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. త్వరలో ఈశాన్య రాష్ట్రాలకు కూడా సర్వీసులు ప్రారంభిస్తామని ట్రూజెట్ మరో డైరెక్టర్ తెలిపారు. కోయంబత్తూరు, పుణె, గోవాలకు కూడా సర్వీసులను ప్రారంభిస్తామని చెప్పారు.


Click it and Unblock the Notifications