హేమలత కంపెనీలో రతన్ టాటా పెద్ద మొత్తంలో పెట్టుబడి
సాప్ట్‌వేర్ ఉద్యోగానికి రిజైన్ చేసి, ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే చిన్ స్టార్టప్ కంపెనీని ప్రారంభించిన తమిళ ఔత్సాహికురాలు అన్నామలై హేమలతకు టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా అండగా నిలబడ్డారు.
ఆమె ప్రారంభించినన సంస్ధ 'ఆంపిరే' సంస్ధ భవిష్యత్తులో ఉన్నత స్ధితికి చేరుకుంటుందని భావించిన ఆయన పెద్ద మొత్తంలో పెట్టుబడులను పెట్టారు. కోయంబత్తూరు ప్రధాన కేంద్రంగా హేమలత 'ఆంపిరే' అనే కంపెనీని స్ధాపించారు.
ఆమె ఆలోచన
నచ్చి ఫోరం సినర్జీస్, స్పెయిన్‌కు చెందిన ఆక్సన్ క్యాపిటల్ కంపెనీలు భాగస్వాములుగా వచ్చి చేరాయి. 'ఆంపిరే'లో రతన్ టాటా ఎంత మొత్తంలో పెట్టుబడులు పెట్టారన్న విషయాన్ని వెల్లడించడాన్ని నిరాకరించారు హేమలత.

హేమలత కంపెనీలో రతన్ టాటా పెద్ద మొత్తంలో పెట్టుబడి
రతన్ టాటా పెట్టుబడులతో ఎలక్ట్రిక్ స్కూటర్లు, సైకిళ్లు, ఆటోల తయారీని పెద్ద ఎత్తున చేపట్టనున్నట్టు ఆమె పేర్కొన్నారు. స్టార్టప్ కంపెనీలకు ఊతమిచ్చే ఉద్దేశ్యంతో రతన్ టాటా ఇప్పటికే పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.

హేమలత కంపెనీలో రతన్ టాటా పెద్ద మొత్తంలో పెట్టుబడి
రతన్ టాటా ఇప్పటికే వ్యక్తిగత హోదాలో స్నాప్‌డీల్, కార్‌దేఖో, పేటిఎం, అర్బన్ లాడర్ వంటి స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల కంపెనీ జియోనీలో కుడా రతన్ టాటా పెట్టుబడులు పెట్టారు.

హేమలత కంపెనీలో రతన్ టాటా పెద్ద మొత్తంలో పెట్టుబడి
ఇటీవలే ఆన్‌లైన్ ట్యాక్సీ సర్వీసుల సంస్థ ఓలాలో పెట్టుబడులు పెట్టారు. అయితే ఎంత మొత్తంలో పెట్టుబుడలు పెట్టారనేది మాత్రం తెలియరాలేదు.

హేమలత కంపెనీలో రతన్ టాటా పెద్ద మొత్తంలో పెట్టుబడి
బాంబే ఐఐటికి చెందిన భవిష్ అగర్వాల్, అంకిత్ భట్టి ప్రమోట్ చేసిన ఓలా కంపెనీ ఈక్విటీలో రతన్ టాటా తాజాగా వాటా తీసుకున్నారు.


Click it and Unblock the Notifications