ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న గ్రీసుకు యూరోపియిన్ దేశాలు నేతలు తుది గడువుని విధించాయి. అప్పుల్లో కూరుకుపోయి రుణ ఎగవేతదారుగా మారిన గ్రీసును ఎలా గట్టెక్కించాలనుకుంటున్నారో చెప్పాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలతో ఆదివారంలోగా ముందుకు రావాలని గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రాస్‌కు యూరో నేతలు స్పష్టం చేశారు.
ఒకవేళ అలా రాని పక్షంలో యూరో జోన్ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని యూరోపియన్ దేశాల నేతలు హెచ్చరించారు. మంగళవారం జరిగిన యూరోజోన్ కీలక సమావేశానికి గ్రీసు కొత్త ఆర్థిక మంత్రి యుక్లిడ్ సకలతోస్ ఎలాంటి ప్రతిపాదనలతో రాకపోవడంతో యూరోజోన్ తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

గ్రీస్‌కు చివరి అవకాశం: తుది గడువు ఆదివారం
ఇది గ్రీసులో నెలకొన్న సమస్య కాదని, భవిష్యత్తులో యూరోపియన్ యూనియన్ దేశాలు ఎదుర్కొనే సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని యూరో జోన్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్ వ్యాఖ్యానించారు.

గ్రీస్‌కు చివరి అవకాశం: తుది గడువు ఆదివారం
మరోవైపు గ్రీస్ పరిస్థితులు యూరోజోన్‌కే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో యూరోజోన్‌లోని 19 దేశాలే ఐరోపాలోని మొత్తం 28 దేశాల అధినేతలు సమావేశం కానున్నారు.

గ్రీస్‌కు చివరి అవకాశం: తుది గడువు ఆదివారం
ఇక యూరోపియన్ దేశాలు గ్రీసును వాడుకుంటున్నారని ప్రధాని అలెక్సిస్ ఆరోపించారు. యూరోపియన్ పార్లమెంట్‌లో ఆయన మాట్లాడుతూ యూరోజోన్ సమస్యల సుడిగుండంలో ఉన్నప్పుడు గ్రీసును పట్టించుకోలేదని వాపోయారు.

గ్రీస్‌కు చివరి అవకాశం: తుది గడువు ఆదివారం
ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంపై సహాయం అందించేందుకు మిగితా దేశాలు వెనుకంజ వేస్తున్నాయని విమర్శించారు. ఈ సంక్షోభం నుంచి గ్రీస్‌ను గట్టేక్కించాలంటే రాబోయే మూడు సంవత్సరాల పాటు రుణాన్ని ఇవ్వాలని గ్రీసు ప్రతిపాదించింది.

గ్రీస్‌కు చివరి అవకాశం: తుది గడువు ఆదివారం
ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టేక్కించేందుకు గాను యూరోజోన్ దేశాలతో పాటు, గ్రీస్ ప్రధాని అమెరికా అధ్యక్షడు ఒబామాని చర్చలకు ఆహ్వానించారు. ఈ వ్యవహారంపై ఓ నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉందని, దీనివల్ల కేవలం గ్రీస్‌కే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలుగుతుందన్నారు.

గ్రీస్‌కు చివరి అవకాశం: తుది గడువు ఆదివారం
గ్రీస్ ఆర్ధిక సంక్షోభంపై మంగళవారం ఫోన్‌లో గ్రీస్ ప్రధాని సిప్రాస్ సంక్షోభం పరిస్థితులన్నింటిని ఒబామాకు వివరించారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ వర్గాలు కూడా ధృవీకరించాయి. గ్రీస్, యూరోజోన్‌ల మధ్య తీసుకున్న భవిష్యత్ ప్రణాళితను ఆయన ఒబామాకు వివరించారు.

గ్రీస్‌కు చివరి అవకాశం: తుది గడువు ఆదివారం
దీంతో గ్రీసుకు పెద్ద మొత్తంలో రుణమిచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఏంజెలో మోర్కెల్‌తో ఒబామా మాట్లాడినట్లు వైట్ హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. గ్రీస్ ఆర్ధిక సంక్షోభాన్ని పరిష్కరించడం ప్రస్తుతం ప్రతి అందరి బాధ్యతగా ఒబామా పేర్కొన్నట్లు వైట్‌హైజ్ వర్గాలు తెలిపాయి.

గ్రీస్‌కు చివరి అవకాశం: తుది గడువు ఆదివారం
మరోవైపు వేతనాలు, పెన్షన్ల చెల్లింపులకు సంబంధించి ఓ పత్రిక అసత్య ప్రచారం చేస్తోందని గ్రీస్ ఆర్థిక మంత్రిత్వ శాఖ మండిపడింది. రుణదాతలతో కీలక చర్చలు జరుపుతున్న తరుణంలో ఇలాంటి తప్పుడు రాతలు ఎంత మాత్రం మంచివి కావని, ఇవి గ్రీసు ప్రయోజనాలకే భంగం వాటిల్లేలా చేస్తున్నాయని ఆగ్రహించింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications