బెంగుళూరు: విజయ్ మాల్యాకు కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ ద్వారా పెద్ద పెద్ద తగిలింది. తాజాగా ఇప్పుడు విజయ్ మాల్యా చేతుల్లోని యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ సైతం జారిపోయింది. విజయ్ మాల్యాకు బ్రిటన్ కు చెందిన డియాజియో గట్టి షాకిచ్చింది.
విజయ్ మాల్యా నిర్వహణలోని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యుబిఎల్) ఈక్విటీలో, తమ నిర్వహణలోని యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్(యుఎస్‌ఎల్)కు ఉన్న 3.21 శాతం వాటాను విక్రయించినట్టు ప్రకటించింది.
ఒక్కో షేరును రూ.1,030 చొప్పున రూ.872 కోట్లకు హీనెకెన్ ఇంటర్నేషనల్ అనే కంపెనీకి విక్రయించినట్టు మంగళవారం బిఎస్‌ఇకి తెలియజేసింది. దీంతో యూబీ గ్రూపుకి చెందిన మెజారిటీ వాటాలు డచ్ లిక్కర్ దిగ్గజం హెనికిన్ ఆధీనంలోకి వెళ్లిపోయాయి.
దీంతో యునైటెడ్ బ్రూవరీస్ గ్రూపులో హెనికిన్ వాటా 42 శాతం కాగా, విజయ్ మాల్యా వాటా 32 శాతానికే పరిమతమైంది. గతంలో విజయ్ మాల్యాతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా, వాటాలను కొనుగోలు చేశామని హెనికిన్ మంగళవారం ప్రకటించింది.

మాల్యాకు డియాజియా షాక్: డచ్ కంపెనీ చేతికి 'కింగ్‌ఫిషర్'
తాజా వాటాల కొనుగోళ్లతో ఛైర్మన్ నుంచి సీఎఫ్ఓ, బోర్డు డైరెక్టర్లు తదితర పదవులు హెనికిన్ సూచించిన వాళ్లకే దక్కనున్నాయి. మాల్యాకు చెందిన యూబీ గ్రూపు నేతృత్వంలోని యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్(యుఎస్‌ఎల్)లో మెజారిటీ వాటా (55 శాతం)ను 2012లో డియాజియో చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.

మాల్యాకు డియాజియా షాక్: డచ్ కంపెనీ చేతికి 'కింగ్‌ఫిషర్'
ఇందుకు గాను డియాజియో సుమారు 3 బిలియన్ డాలర్లు వెచ్చించింది. కాగా కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్, ఇతర యూబీ గ్రూపు సంస్ధలకు మాల్యా అక్రమంగా రూ. 1,337 కోట్ల యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్(యుఎస్‌ఎల్) నిధులను పక్కదారి పట్టించారని ఆరోపిస్తూ, కంపెనీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా యుఎస్‌ఎల్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

మాల్యాకు డియాజియా షాక్: డచ్ కంపెనీ చేతికి 'కింగ్‌ఫిషర్'
దీనిపై దర్యాప్తునకు కూడా అంతర్జాతీయ ఆడిట్ సంస్ధను ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా నిధుల మళ్లింపు జరిగినట్లు ఆడిట్ సంస్ధ పీడబ్ల్యూసీ దర్యాప్తులో తేల్చింది. యునైటెడ్ స్పిరిట్స్(యూఎస్ఎల్)లో అధిక వాటాను డియాజియో కొనుగోలు చేసినా, ఛైర్మన్, డైరెక్టర్‌గా విజయ్ మాల్యా కొనసాగుతున్నారు.

మాల్యాకు డియాజియా షాక్: డచ్ కంపెనీ చేతికి 'కింగ్‌ఫిషర్'
యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్(యూఎస్‌ఎల్) బోర్డు పదవి నుంచి తనను తీసివేసే అధికారం కేవలం షేర్ హోల్డర్లకు మాత్రమే ఉందని సంస్థ చైర్మన్ విజయ్ మాల్యా అంటున్నారు. తన పదవుల నుంచి తప్పుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.


Click it and Unblock the Notifications