యూరోజోన్ నుంచి గ్రీస్ వైదొలగనుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో పెద్దన్న రంగంలోకి దిగాడు. గ్రీస్ ఆర్ధిక సంక్షోభం, ఇకపై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించడానికి గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రాస్‌తో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫోన్‌లో మాట్లాడినట్లు వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి.
గ్రీస్, యూరోపియన్ దేశాల నేతలు సర్దుకుపోవాలని ఒక ఒప్పందానికి రావాలని ఒబామా సూచించినట్లు వైట్ హౌస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. గ్రీస్, యూరోజోన్ అంగీకారం కుదుర్చుకోవాలని అందురూ భావిస్తున్నట్లు తెలిసింది.
గ్రీసుకు పెద్ద మొత్తంలో జర్మనీ రుణాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒబామా గ్రీస్ ప్రధానితో పాటు జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌కు కూడా ఫోన్ చేశారని, వారు కూడా గ్రీస్ సంక్షోభం నుంచి బయటకు రావడానికి ఒక ఒప్పందానికి రావాలని కోరుకుంటున్నట్లు వైట్‌హౌస్ తెలిపింది.
మరోవైపు గ్రీసును యూరోజోన్ నుంచి తప్పించి రిస్క్ చేయలేమని, ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపేడుతుందని ఫ్రాన్స్ ప్రధాని మానుయెల్ వాల్స్ అన్నారు. యూరోపియన్ యూనియన్‌తో గ్రీసు ఒప్పందం కుదిరించుకునేందుకు ఇప్పటికీ అవకాశాలున్నాయన్నారు. గ్రీసు
యూరోజోన్‌లోనే కొనసాగేందుకు ఫ్రాన్స్ తనవంతుగా అన్ని ప్రయత్నాలూ చేస్తుందని చెప్పారు.

గ్రీస్ సంక్షోభం: రంగంలోకి దిగిన ఒబామా
ఇది ఇలా ఉంటే గ్రీస్ బ్యాంకులకు అత్యవసర నిధులను ఔదార్యంతో, చాలీ చాలని పూచీకత్తతో ఇవ్వలేమని యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. గ్రీసులోని ప్రధాన బ్యాంకులన్నీ మూతపడటంతో, గ్రీసు బ్యాంకులకు అత్యవసర ద్రవ్య సహాయం (ఈఎల్‌ఏ) కింద యూరోపియన్ బ్యాంక్ ఇస్తున్న నిధులకు కఠిన నిబంధనలు అమలు చేస్తుంది.

గ్రీస్ సంక్షోభం: రంగంలోకి దిగిన ఒబామా
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ నగరంలోని యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయంలో మూడో దఫా ఉద్దీపనల విషయమై మంగళవారం జరిగిన అత్యవసర సమావేశంలో ఒప్పందాలపై గ్రీసు ప్రధాని అలెక్సిస్ సిప్రాస్, యూరోజోన్ సభ్యులు, యూరోపియన్ కమిషన్ మధ్య రాజీ కుదరలేదు.

గ్రీస్ సంక్షోభం: రంగంలోకి దిగిన ఒబామా
యూరోజోన్ కీలక సమావేశానికి గ్రీసు కొత్త ఆర్ధిక మంత్రి యుక్లిడ్ సకలోతోస్ ఒట్టి చేతులతో వచ్చారు. సరైన ప్రణాళికతో రాకపోవడంతో సమావేశంలో పాల్గొన్న సభ్యులు కొపడ్డారు. అయితే బుధవారం మరోసారి సరైన రుణ ప్రణాళికను సమర్పించాలని యూరోపియన్ సభ్యులు అలెక్సిస్ సూచించారు.

గ్రీస్ సంక్షోభం: రంగంలోకి దిగిన ఒబామా
రుణ సాయం పొందేందుకు వ్యయ నియంత్రణ దిశగా ఆర్థిక సంస్కరణలు చేపట్టాలని రుణదాతలు గ్రీసు సర్కారుకు షరతులు విధించారు. ఈ విషయమై అయితే ఈ విషయంపై ఆదివారం నిర్వహించిన రెఫరెండంలో 61.3 శాతం ప్రజలు సంస్కరణలు వ్యతిరేకించారు.

గ్రీస్ సంక్షోభం: రంగంలోకి దిగిన ఒబామా
ఖచ్చితమైన ప్రణాళికతో రావాలని గ్రీసు ప్రధానిని ఉద్దేశించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే, జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ సోమవారం సంయుక్తంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications