నెట్‌వర్క్ 18: తగ్గిన రిలయన్స్ వాటా, నష్టాల్లో షేర్లు

మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో సేవలు అందిస్తున్న నెట్‌వర్క్ 18లో 3.25 కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించిన నేపథ్యంలో కంపెనీ షేర్లు మంగళవారం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. నెట్‌వర్క్‌18 మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీలో తమ వాటాను 75 శాతానికి తగ్గించుకోబోతున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీంతో సంస్థలో ప్రమోటర్ల వాటా 78.10 శాతం నుంచి 75 శాతానికి తగ్గనున్నది. ఇందుకోసం ఈక్విటీలో 3.10 శాతానికి సమానమైన 3.25 కోట్ల షేర్లను విక్రయించాలని నిర్ణయించింది. లిస్టెడ్‌ కంపెనీల ఈక్విటీలో కనీసం 25 శాతం పబ్లిక్‌ దగ్గర ఉండాలన్న సెబి నిబంధనలకు అనుగుణంగా ఈ చర్య తీసుకుంటున్నట్టు బీఎస్ఈకి తెలిపింది.

నెట్‌వర్క్ 18లో తగ్గనున్న రిలయన్స్ వాటా

నెట్‌వర్క్ 18లో తగ్గనున్న రిలయన్స్ వాటా

ఇదే గ్రూప్ సంస్ధకు టీవీ 18 బ్రాడ్ కాస్ట్ లిమిటెడ్ నాన్ ఎగ్జిక్యూటివ్, స్వతంత్ర డైరెక్టర్ బాధ్యతల నుంచి హరి ఎస్ భాటియా వైదొలగినట్లు కంపెనీ సోమవారం బీఎస్‌ఈకి తెలిపింది.

నెట్‌వర్క్ 18లో తగ్గనున్న రిలయన్స్ వాటా

నెట్‌వర్క్ 18లో తగ్గనున్న రిలయన్స్ వాటా

3.10 శాతానికి సమానమైన 3.25 కోట్ల షేర్లను బహిరంగ మార్కెట్లో విక్రయించడం ద్వారా సంస్థకు రూ. 200 కోట్లకు పైగా నిధులు సమకూరే అవకాశం ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ హోల్డింగ్స్‌కు షినానోలో 100 శాతం వాటాలున్నాయి.

నెట్‌వర్క్ 18లో తగ్గనున్న రిలయన్స్ వాటా

నెట్‌వర్క్ 18లో తగ్గనున్న రిలయన్స్ వాటా

గతేడాది రూ.4 వేల కోట్ల పెట్టుబడితో నెట్‌వర్క్ 18 మీడియా గ్రూపును ఆర్‌ఐఎల్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

నెట్‌వర్క్ 18లో తగ్గనున్న రిలయన్స్ వాటా

నెట్‌వర్క్ 18లో తగ్గనున్న రిలయన్స్ వాటా

ఈ షినాలో రిటైల్ సహా మరో కంపెనీ ద్వారానే రెండు విడతలుగా రామోజీరావుకు చెందిన 'ఈనాడు' గ్రూప్‌లో రిలయన్స్ సంస్ధ దాదాపు రూ. 2,700 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది.

 నెట్‌వర్క్ 18లో తగ్గనున్న రిలయన్స్ వాటా

నెట్‌వర్క్ 18లో తగ్గనున్న రిలయన్స్ వాటా

నెట్‌వర్క్‌18 నిర్వహణలో ప్రస్తుతం సిఎన్‌బిసి టీవీ18, సిఎన్‌ఎన్‌ ఐబిఎన్‌తో పాటు పలు వినోద, వార్తా చానళ్లు, వెబ్‌సైట్స్ ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+