న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'డిజిటిల్ ఇండియా' ప్రాజెక్టుకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ ఫోన్, వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తేవడం ద్వారా, ప్రభుత్వ సేవలు, రోజువారీ కార్యక్రమాలను సులభతం చేయాలన్నదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
డిజిటల్ ఇండియా పథకానికి పారిశ్రామికవేత్తలు 4.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చారు. ఈ పెట్టుబడులతో దేశంలో సుమారు 18 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్డేడియంలో ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ఈ డిజిటల్ ఇండియా ప్రాజెక్టుని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆర్‌ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఆయన సోదరుడు అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ, భారతి ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునిల్ మిట్టల్, టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ, ఆదిత్య బిర్లాగ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా, విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్‌జీ తదితరులు హాజరయ్యారు.
వీరితో పాటు ఎయిర్‌బస్ ప్రతినిధి బెర్నార్డ్ గెర్వర్ట్, తైవాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం డెల్టా సిఇఒ పింగ్ చాంగ్ కూడా ఉన్నారు. డిజిటల్ ఇండియా లక్ష్య సాధనకోసం భారీ పెట్టుబడులను పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పారిశ్రామికవేత్తలు ప్రకటించారు.

అబ్బాయ్ టై సరిచేస్తున్న బాబాయ్
డిజిటల్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్‌కు బాబాయ్ అనిల్ అంబానీ టై సరిచేస్తున్న దృశ్యం. పక్కనే చిరునవ్వులు చిందిస్తూ ముకేశ్ కుమార్తె ఈశా అంబానీ.

ముకేశ్ అంబానీ మాట్లాడుతూ..
డిజిటైలేజేషన్ ప్రారంభం ఓ గొప్ప ముందుడగు అంటూ ఆయన అభివర్ణించారు. డిజిటల్ ఇండియాతో భారతీయుల జీవన విధానం మారుతుందని ఆర్ఐఎల్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. ఈ డిజిటల్ ఇండియా పథకంలో రూ. 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా ద్వారా 5 లక్షల మందికి ఉద్యోగఅవకాశాలు వస్తాయన్నారు. అంతేకాక సామాజిక మార్పునుకు డిజిటల్ ఇండియా ఎంతోగానూ దోహదపడుతుందని చెప్పారు.

కుమార మంగళం బిర్లా మాట్లాడుతూ...
బ్రాడ్ బ్యాండ్ నెట్‌వర్క్, వైఫై అభివృద్ధిలో ఆదిత్యా బిర్లా గ్రూప్ భారీగా పెట్టుబడులు పెడుతుందని ఆదిత్యా బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా అన్నారు. ఐడియా నెట్ వర్క్ ఇప్పటికే 16.5 కోట్ల మందిని అనుసంధానం చేస్తోంది కుమార మంగళం బిర్లా చెప్పారు. ఆదిత్య బిర్లా గ్రూప్ డిజిటల్ ఇండియా ప్రాజెక్టు నేపథ్యంలో 900 కోట్ల డాలర్ల (57,000 కోట్ల రూపాయలు) పె ట్టుబడులకు సన్నాహాలు చేస్తోంది. డిజిటల్ ఇండియా పరిధిలోకి వచ్చే ప్రాజెక్టుల కోసం మరో 13 వేల కోట్ల రూపాయలను కేటాయిస్తారు.

సునీల్ మిట్టల్ మాట్లాడుతూ....
ప్రతి గ్రామం చెంతకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో విద్య, ఆరోగ్యాన్ని తీసుకెళ్లడంతో పాటు 4 జీ సేవలు అందించేందుకు వచ్చే ఐదేళ్లలో రూ. లక్ష కోట్లను వెచ్చించనున్నట్లు భారతీ ఎంటర్ ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ తెలిపారు.

అనిల్ అంబానీ మాట్లాడుతూ....
భారత ప్రధాని నరేంద్రమోడీ డిజిటల్ ప్రపంచంలో ఎంతో ప్రజాదరణ ఉన్న వ్యక్తి అని అడాగ్ ఛైర్మన్ అనిల్ అంబానీ కొనియాడారు. ట్విట్టర్‌లో ప్రధాని మోడీని 80 లక్షల మంది అనుసరిస్తున్నారని చెప్పారు. దేశ వ్యాప్తంగా డిజిటల్ వ్యాప్తి, క్లౌడ్ కంప్యూటింగ్, టెలికాం విభాగాల విస్తరణ నిమిత్తం రూ. 10,000 వేల కోట్లను పెట్టుబడి పెడతామని చెప్పారు.

అజీమ్ ప్రేమ్‌జీ మాట్లాడుతూ....
భారత్‌ను శక్తి వంతంగా మలిచేందుకు మోడీ కలలు కంటున్నారని అదే డిజిటల్ ఇండియా అని పేర్కొన్నారు. ఆర్ధిక పౌర సేవల్లో డిజిటల్ ఇండియాతో విప్లవం తెస్తుందని విప్రో ఛైర్మన్ అజీమ్‌ప్రేమ్‌జీ అన్నారు. ప్రతి గడపకూ డిజిటల్ సేవలు అందించడం ద్వారా అగ్రదేశాల సరసన భారత్ నిలుపుతుందని చెప్పారు. వైద్య సేవల కోసం విప్రో చిన్న మధ్య తరహా సంస్థలను ఆన్‌లైన్‌లోకి తెచ్చిందని చెప్పారు.

సైరస్ మిస్త్రీ మాట్లాడుతూ....
డిజిటిల్ ఇండియా చేయాలన్న ప్రధాని ముందు చూపు గొప్ప లక్ష్యమని సైరస్ మిస్త్రీ అన్నారు. డిజిటైజేషన్‌లో ముందున్న దేశాలను అధిగమించాలన్న లక్ష్యంతో భారత్ అడుగులేస్తోందని మిస్త్రీ పేర్కొన్నారు.

అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ....
వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ సంస్థ స్టెర్‌లైట్ టెక్నాలజీస్ 40 వేల కోట్ల రూపాయలతో ఎల్‌సిడి ప్యానెల్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. దీనివల్ల కనీసం 50 వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా.

రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ
డిజిటల్ ఇండియా పారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఐటీ సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ డిజిటల్ ఇండియా గొప్ప మార్పుని తీసుకొస్తుందని చెప్పారు. 'మేక్‌ఇన్ ఇండియా' లేకుంటే 'డిజిటల్ ఇండియా' అసంపూర్తిగా మిగిలిపోతుందన్నారు.
డిజిటల్ ఇండియా ద్వారా అవినీతి నిర్మూలన సాధ్యమని అన్నారు. దేశంలో 975 మంది మిలియన్ల మొబైల్ వినియోగదారులున్నారని చెప్పారు. డిజిటల్ ఇండియాలో అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ ప్రాజెక్టులో పారిశ్రామికవేత్తలు పాల్గొనాలని అన్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications