సినీ నటుడు రానా నగరంలో సందడి చేశారు. మంగళవారం రామానాయుడు స్టూడియోలో రూష్ కంపెనీకి చెందిన పాదరక్షలు 'స్మార్ట్ క్యూజువల్' కలెక్షన్‌ను అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టైల్ విషయంలో తన బాబాయ్ వెంకటేశ్‌నే ఎక్కువగా అనుకరిస్తానని చెప్పారు.
2015లో అందరూ అత్యంత నిరీక్షణతో విడుదలకు వేచి చూస్తోన్న బాహుబలి చిత్రంలో రానా ప్రధాన పాత్ర పోషించాడు. బాహుబలి చిత్రం గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ దానవీర శూర కర్ణ సినిమా తర్వాత చరిత్రలో నిలిచపోయే చిత్రమవుతుందని అన్నారు.

నగరంలో సందడి చేసిన రానా
రూష్ పుట్ వేర్ గురించి రానా మాట్లాడుతూ తక్కువ చికాకుతో కూడుకున్న వస్తువులనే మగవారు ఎక్కువగా ఇష్టపడతారు. పగటి వేళలు, పని వేళల తర్వాత కూడా మా వ్యక్తిగత స్టైల్ ను ప్రతిబింబించే సరళంగా, స్మార్ట్ గా ఉండే ఉత్పత్తులను మేము ఇష్టపడతామన్నారు.

నగరంలో సందడి చేసిన రానా
ఉదయం నుంచి సాయంత్రం వరకు బూట్లను మార్చుకోవడం చాలా విసుగుతో కూడుకుని ఉంటుంది. రూష్ వారి స్మార్ట్ క్యాజువల్ కలక్షన్ నా సమస్యను పరిష్కరించాయని తెలిపారు.

నగరంలో సందడి చేసిన రానా
రూష్ వారి స్మార్ట్ క్యూజువల్ కలక్షన్ నా దైనందిన కార్యక్రమాలు మరియు నా పని పూర్తయిన తర్వాత ఫార్మల్ మరియు ఇన్ ఫార్మల్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అవి అతికినట్లు సరిపోతాయన్నారు.

నగరంలో సందడి చేసిన రానా
రూష్ స్మార్ట్ క్యాజువల్ కలక్షన్‌లో వివరణలతో కూడిన అంశాలతో సౌకర్యవంతమైన డ్రైవింగ్ బూట్లు, ప్రత్యేక రూపం ఫినిసెస్, రగ్గ్‌డ్ బూట్లు మరియు అందుమైన శాండల్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications