For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్‌బీఐలో భారతీయ మహిళా బ్యాంక్‌ విలీనం?

By Nageswara Rao
|

2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన భారతీయ మహిళా బ్యాంక్‌(బిఎంబి)ను స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనం చేయాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని సంబంధింతి వర్గాలు తెలిపాయి.

ఈ విషయంపై ఎస్‌బీఐ ఛైర్మన్ అరుంధతి భట్టాచార్య సంప్రదించగా తనకింత వరకు ఎలాంటి సమాచారం లేదని, బహుళ మంత్రివర్గంలో చర్చించి ఉంటారని ఆమె అన్నారు. భారతీయ మహిళా బ్యాంక్‌ను విలీనం చేసుకోవడం తమకెలాంటి ఇబ్బంది లేదని, కాకపోతే బిఎంబి చాలా చిన్న సంస్ధ అని చెప్పారు.

ఎస్‌బీఐలో భారతీయ మహిళా బ్యాంక్‌ విలీనం?

ఎస్‌బీఐలో భారతీయ మహిళా బ్యాంక్‌ విలీనం?

భారతీయ మహిళా బ్యాంకుని 2013లో అప్పటి ఆర్ధిక మంత్రి పి. చిదంబరం ప్రారంభించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారతీయ మహిళా బ్యాంక్‌(బిఎంబి)కి 60 శాఖలున్నాయి. 1000 కోట్ల రూపాయల మూలధనంతో దీన్ని ప్రారంభించారు.

ఎస్‌బీఐలో భారతీయ మహిళా బ్యాంక్‌ విలీనం?

ఎస్‌బీఐలో భారతీయ మహిళా బ్యాంక్‌ విలీనం?

ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ గతేడాది మాట్లాడుతూ బ్యాంకులు తమంతట తాము విలీనాలు జరుపుకునే స్వతంత్రం ఇస్తామని చెప్పారు. గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన అసోసియేట్‌ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్‌లను విలీనం చేసుకుంది.

ఎస్‌బీఐలో భారతీయ మహిళా బ్యాంక్‌ విలీనం?

ఎస్‌బీఐలో భారతీయ మహిళా బ్యాంక్‌ విలీనం?

2008 సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్రను ఎస్‌బీఐ విలీనం చేసుకుంది. ఆ తర్వాత రెండు సంవత్సరాలకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్‌ను కూడా విలీనం చేసుకోవడం గమనార్హం.

ఎస్‌బీఐలో భారతీయ మహిళా బ్యాంక్‌ విలీనం?

ఎస్‌బీఐలో భారతీయ మహిళా బ్యాంక్‌ విలీనం?

ఇక పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో బిఎంబి ఇంకా లిస్ట్‌ కాలేదు. మహిళా సాధికారిత కోసం ఈ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. 2014 మార్చి చివరకు బ్యాంకు 175 కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహించింది.

English summary

ఎస్‌బీఐలో భారతీయ మహిళా బ్యాంక్‌ విలీనం? | Finance Ministry considering merger of Bhartiya Mahila Bank with SBI

Finance Ministry is considering a proposal to merge newly created Bharatiya Mahila Bank (BMB) with State Bank of India.
Story first published: Wednesday, July 1, 2015, 16:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X