మాన్‌సూన్ ఆఫర్: తక్కువ వడ్డీకే ఎస్‌బీహెచ్ హోంలోన్స్
హైదరాబాద్: గృహ రుణాలు తీసుకునే వారిని ఆకర్షించడానికి గాను 'మాన్‌సూన్ ధమాకా-2015' పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న 1800 పైగా శాఖల్లో ఈ క్యాంపెయిన్ ప్రారంభమవుతుందని ఎస్‌బిహెచ్ తెలిపింది.
'మాన్‌సూన్ ధమాకా' పేరుతో రుణాలు తీసుకున్న వారికి తక్కువ వడ్డీ రేటు ఉంటుంది. అంతే కాదు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులను విధించటం లేదని పేర్కొంది. మాన్‌సూన్ ధమాకాలో భాగంగా 30 ఏళ్ల కాలపరిమితి గల గృహ రుణాలపై ప్రతి లక్ష రూపాయలకు ఈంఐ 882 రూపాయలుంటుందని బ్యాంకు తెలిపింది.

మాన్‌సూన్ ధమాకా: తక్కువ వడ్డీకే ఎస్‌బీహెచ్ హోం లోన్స్
'మాన్‌సూన్ ధమాకా' పేరుతో రుణాలు తీసుకున్న వారికి తక్కువ వడ్డీ రేటు ఉంటుంది. అంతే కాదు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజులను విధించటం లేదని పేర్కొంది.

మాన్‌సూన్ ధమాకా: తక్కువ వడ్డీకే ఎస్‌బీహెచ్ హోం లోన్స్
మాన్‌సూన్ ధమాకాలో భాగంగా 30 ఏళ్ల కాలపరిమితి గల గృహ రుణాలపై ప్రతి లక్ష రూపాయలకు ఈంఐ 882 రూపాయలుంటుందని బ్యాంకు తెలిపింది.

మాన్‌సూన్ ధమాకా: తక్కువ వడ్డీకే ఎస్‌బీహెచ్ హోం లోన్స్
వీటితో పాటు రుణ ప్రాసెసింగ్ రుసుము, గడువు కంటే ముందుగా రుణాన్ని తిరిగి చెల్లిస్తే విధించే అపరాధ రుసుము ఉండదని పేర్కొంది. రుణంపై వడ్డీ రేటును రోజు వారీ ప్రాతిపదికన లెక్కిస్తారు.

మాన్‌సూన్ ధమాకా: తక్కువ వడ్డీకే ఎస్‌బీహెచ్ హోం లోన్స్
గత ఆర్థిక సంవత్సరంలో పర్సనల్ సెగ్మెంట్ అడ్వాన్సుల్లో గృహ రుణ పోర్టుఫోలియో అద్భుతమైన పనితీరును కనబరిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది ఈ విభాగంలో 21 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎస్‌బీహెచ్ తెలిపింది.


Click it and Unblock the Notifications