రియల్ ఎస్టేట్ రంగంలో సేవలందిస్తోన్న హౌసింగ్ డాట్ కాం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ యాదవ్ మరోసారి రాజీనామా చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. వివాదాస్పదుడిగా పేరు తెచ్చుకున్న రాహుల్ మరోసారి సంస్ధను వీడి వెళ్లనున్నట్లు సమాచారం.
ఈసారి మాత్రం ఆయన రాజీనామాను బోర్డు డైరెక్టర్లు ఆమెదిస్తారనే తెలుస్తోంది. గతంలో కూడా బోర్డు డైరెక్టర్లను ఎందుకూ పనికిరానివారని, మీవల్లే సంస్థ అధోగతి పాలవుతోందని ఆరోపణలు చేసిన రాహుల్ యాదవ్ రాజీనామా చేశాడు.
అయితే బోర్డు సభ్యులు అతడిని బతిమిలాడి తన నిర్ణయాన్ని మార్చుకునేలా చేశారు. బోర్డు డైరెక్టర్లతో జరిపిన ఆశావాహ చర్చల అనంతరం నా రాజీనామాను ఉపసంహరించు కుంటున్నాను. నేను చేసిన ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలపట్ల బోర్డు సభ్యులకు క్షమాపణ చెబుతున్నానని రాహుల్ కంపెనీ ద్వారా వెలువడిన ప్రకటనలో వివరించారు.

ఆ తర్వాత సంస్ధలోని తన వాటా ఈక్విటీలను ఉద్యోగులకు పంచి రాహుల్ గొప్ప ఔదర్యాన్ని ప్రదర్శించాడు. కార్పొరేట్ రంగంలోనే పెద్ద వార్త అయింది. రాహుల్ వ్యక్తిగత షేర్ల విలువ రూ. 150 - 200 కోట్ల మధ్య ఉంటుంది. తనలాగే అందరూ చెయ్యాలంటూ, వివిధ ప్రముఖలు పేర్లను ప్రస్తావించాడు.
కాగా, రాహుల్ తాజా రాజీనామాపై రెండు వారాల్లో జరిగే బోర్డు డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకుని, ఆమోదించవచ్చని తెలుస్తోంది. మూడేళ్ల క్రితం చదువుతున్న ఇంజనీరింగ్ విద్యను వదిలేసి వచ్చి బాంబే ఐఐటీ మిత్రులతో కలసి హౌసింగ్ డాట్ కాంను రాహుల్ యాదవ్ ప్రారంభించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications