100 నోటుకు మరింత భద్రత, డిసెంబర్ వరకు గడువు
దేశంలో పెద్ద ఎత్తున దొంగ నోట్లు చెలామణీ అవుతున్న నేపథ్యంలో దానిని అరికట్టే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (అర్‌బీఐ) చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా రూ. 100 నోట్లలో సెక్యూరిటీ ఫీచర్స్‌ను మరింత పంపొందించే దిశగా చర్యలకు ఉపక్రమించింది.
మహాత్మాగాంధీ సిరిస్-2005లో వచ్చే రూ. 100 నోట్లపై ఉండే సంఖ్యా ప్యానెళ్లలోని అంకెల... ఎడమ నుంచి కుడికి ఇకపై పరిమాణం పరంగా ఆరోహణ క్రమంలో ఉంటాయి. అయితే ఈ ఆంకెలకు ముందు ఉంటే మూడు ఆల్ఫా న్యూమరిక్ (అంకెలు, అక్షరాలతో) కూడిన సంఖ్యల మినహా అన్ని గతంలో మాదిరిగానే ఉంటాయి.
నకిలీ నోట్ల నుంచి ఒరిజినల్ నోట్లను గుర్తించడానికి ఆర్‌బీఐ ఈ చర్యలు తీసుకుంది. ఇక 2005కు ముందు ముద్రించిన రూ. 500, రూ. 1000 విలువ చేసే నోట్లు సహా పలు నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవడానికి విధించిన గడువును ఆర్‌బీఐ మరో ఆరు నెలలు పాటు పొడిగించింది.

100 నోటుకు మరింత భద్రత, డిసెంబర్ వరకు గడువు
దేశంలో పెద్ద ఎత్తున దొంగ నోట్లు చెలామణీ అవుతున్న నేపథ్యంలో దానిని అరికట్టే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (అర్‌బీఐ) చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా రూ. 100 నోట్లలో సెక్యూరిటీ ఫీచర్స్‌ను మరింత పంపొందించే దిశగా చర్యలకు ఉపక్రమించింది.

100 నోటుకు మరింత భద్రత, డిసెంబర్ వరకు గడువు
వాస్తవానికి రూ. 500, రూ. 1000 విలువ చేసే నోట్లను జూన్ 30 లోపు మార్చుకోవాలని గతంలో ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా, 2005 కంటే ముందు ఉన్న కరెన్సీ నోట్ల మార్పిడికి గడువు పొడిగించడం ఇది రెండోసారి.

100 నోటుకు మరింత భద్రత, డిసెంబర్ వరకు గడువు
ఇందుకోసం గురువారం ఈ ఏడాది డిసెంబర్ 31ని తుది గడువుగా నిర్ణయిస్తూ పత్రికా ప్రకటన చేసింది. ఇప్పటివరకు ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో సుమారు 164 కోట్ల విలువ చేసే నోట్లను ధ్వంసం చేశారు.

100 నోటుకు మరింత భద్రత, డిసెంబర్ వరకు గడువు
వీటిలో రూ.100, రూ.500, రూ. 1000 విలువ చేసే నోట్లు వరుసగా 86.87 కోట్లు, 56.19 కోట్లు, 21.75 కోట్లుగా ఉన్నాయి. ధ్వంసం చేసిన వెయ్యి రూపాయల నోట్ల మొత్తం విలువ సుమారు రూ. 21.750 కోట్లు.

Click it and Unblock the Notifications