డెబిట్, క్రెడిట్ కార్డు లేకుండా చెల్లింపులు: అదెలాగా..!
ఏ విధమైన కార్డులు వాడకుండా ఆన్‌లైన్‌లో నగదు చెల్లింపులు జరిపే కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఈ సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది 'పేటీఎం'. ఇది ఒక మైబైల్ వాలెట్ లాంటిది. 'పేటీఎం' దేశ వ్యాప్తంగా 5 వేలకు పైగా ఔట్‌లెట్స్ ఉన్నాయి.
ఈ పేటీఎం ఔట్‌లెట్స్‌లోకి వెళ్లి నగదు డిపాజిట్ చేస్తే, ఆ వ్యక్తి పేటీఎం ఖాతాలోకి నగదు జమ అవుతుంది. పేటీఎంలో జమ అయిన నగదుని ఉపయోగించుకుని సురక్షితంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
ఉదాహరణకు మీరు ఏదైనా యాక్సిస్ బ్యాంకు శాఖకు వెళ్లి మీ పేటీఎం ఖాతాలో నగదు డిపాజిట్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో పేటీఎం ఔట్ లెట్ల సంఖ్యను 50 వేల నుంచి 75 వేలకు పెంచాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సంస్ధ వైస్ ప్రెసిడెంట్ అమిత్ లోకహిత చెప్పారు.

డెబిట్, క్రెడిట్ కార్డు లేకుండా చెల్లింపులు
ప్రస్తుతం తాము 8 కోట్ల మంది యూజర్లకు సేవలందిస్తున్నామని, నెలకు 7.5 కోట్ల వరకూ లావాదేవీలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం లావాదేవీలు భారత్‌లోనే జరుగుతున్నట్లు వెల్లడించారు.

డెబిట్, క్రెడిట్ కార్డు లేకుండా చెల్లింపులు
అంతేకాదు బుక్ మై షో, మేక్ మై ట్రిప్, ఉబెర్, ట్యాక్సీ ఫర్ ష్యూర్ వంటి పదిహేను వేల వరకూ వ్యాపార సంస్ధలు ఈ లావాదేవీలను అంగీకరిస్తున్నాయని తెలిపారు.

డెబిట్, క్రెడిట్ కార్డు లేకుండా చెల్లింపులు
సాధారణ బ్యాంకింగ్ విధానంతో పోలిస్తే, ఈ విధానం ద్వారా లావాదేవీలు సులభంగా పూర్తవుతాయని అమిత్ చెప్పారు.

డెబిట్, క్రెడిట్ కార్డు లేకుండా చెల్లింపులు
ఈ లావాదేవీల్లో ఖాతాదారుడి నుంచి ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయమని చెప్పిన అమిత్, ప్రస్తుతం సంస్ధ వార్షిక ఆదాయం 1.5 బిలియన్ డాలర్లుకు చేరిందని తెలిపారు.


Click it and Unblock the Notifications