ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) నిబంధనల్లో మార్కెట్ రెగ్యులేటరీ నియంత్రణ సంస్ధ (సెబీ) కీలక మార్పులు చేసింది. ప్రారంభ (స్టార్టప్) దశలో ఉన్న కంపెనీల లిస్టింగ్ నిబంధనలను కూడా సరళీకృతం చేసింది. ఐపిఒ ముగిసిన 6 రోజుల్లోగా స్టాక్‌మార్కెట్లలో కంపెనీలు లిస్టింగ్ కావాల్సి ఉంటుందని చెప్పింది. ప్రస్తుతం ఇది 12 రోజులుగా ఉంది.
అలాగే ఐపిఒ పెట్టుబడులను చెక్-ఫ్రీగా చేసింది. అంతేగాక మార్కెట్లు, ప్రస్తుత, కొత్త మదుపరుల నుంచి నిధుల సమీకరణ కోసం ‘ఫాస్ట్-ట్రాక్' పద్ధతిలో వెళ్లేందుకు సంస్థలను అనుమతించింది. ఈ మేరకు బోర్డు సమావేశం అనంతరం సెబీ చైర్మన్ యుకె సిన్హా తెలియజేశారు.

సెబీ: ఐపిఒలకు చెక్ ఫ్రీ, స్టార్టప్‌లకు నజరానా
సెబీ తీసుకున్న ఈ నిర్ణయాలతో దేశీ స్టార్టప్ కంపెనీలు నిధుల సమీకరణ కోసం, విదేశీ స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్టింగ్ అవ్వాల్సిన అవసరం లేదు. స్టార్టప్ కంపెనీలు ఈక్విటీలో 75 శాతాన్ని తమకు నచ్చిన సంస్థాగత మదుపరులకు కేటాయించుకోవచ్చు.

సెబీ: ఐపిఒలకు చెక్ ఫ్రీ, స్టార్టప్‌లకు నజరానా
ఈక్విటీలో ప్రమోటర్లకు 10 శాతానికి మించి వాటా లేకపోయినా ఎలాంటి ఓటింగ్ హక్కులు లేకుండా వారు పబ్లిక్ ఇన్వెస్టర్లుగా కొనసాగవచ్చు.

సెబీ: ఐపిఒలకు చెక్ ఫ్రీ, స్టార్టప్‌లకు నజరానా
సీఈఓగా ఉన్న ప్రమోటర్ తన వాటాను అమ్ముకున్నా కంపెనీ బోర్డు ఆమోదంతో మూడు సంవత్సరాల పాటు సీఈఓ లేదా ఇతర సీనియర్ హోదాలో కొనసాగేందుకు అవకాశం.

సెబీ నిర్ణయంపై స్నాప్ డీల్
స్టార్టప్ కంపెనీల లిస్టింగ్‌కు సంబంధించి సెబి తీసుకున్న నిర్ణయాలపై స్నాప్‌డీల్ హర్షం వ్యక్తం చేసింది. నిధుల సమీకరణ కోసం చూస్తున్న స్టార్టప్ కంపెనీలకు ఈ నిర్ణయాలు ఎంతో ఉపయోగపడతాయని ఒక ప్రకటనలో తెలిపింది.ఒకసారి లిస్టింగ్ అయిన తర్వాత కంపెనీల షేర్ల లావాదేవీల కోసం స్టాక్ ఎక్సేంజీల్లో ప్రత్యేక వ్యవస్థీకృత ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ప్రమోటర్లు, లిస్టింగ్‌కు ముందు వాటాలు తీసుకున్న ఇన్వెస్టర్లు, లిస్టింగ్ తర్వాత మూడు సంవత్సరాల వరకు తమ వాటాలను విక్రయించుకునే అవకాశం లేదు.
అయితే స్టార్టప్ కంపెనీల కోసం ఈ కాలపరిమితిని ఆరు నెలలకు కుదించింది. దీంతో పాటు లిస్టింగ్‌కు ముందు టెక్నాలజీ రంగానికి చెందిన స్టార్టప్ కంపెనీల ఈక్విటీలో సంస్థాగత మదుపరుల కనీస పెట్టుబడి 25 శాతానికి తగ్గకుండా ఉండాలని సెబి నిర్దేశించింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications