హైదరాబాద్: మందగమనం నుంచి ఇన్ఫోసిస్ బయటకు వస్తుందని కంపెనీ సీఈఓ విశాల్ సిక్కా ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం బెంగుళూరులో 34వ ఏజీఎమ్‌లో ఆయన మాట్లాడారు. గత ఆర్ధక సంవత్సరంలో రూపాయి ప్రాతిపదికన 6.4 శాతం వృద్ధిని నమోదు చేశామని అన్నారు.
ఇక డాలర్ ప్రాతిపదికన 5.6 శాతాన్ని, స్ధిర మారకపు రేటు ప్రాతిపదికన 7.1 వృద్ధిని సాధించామన్నారు. ఇక ఉద్యోగుల వినియోగం 86 శాతానికి పెరిగి, వలసలు కూడా పదకొండేళ్ల కనిష్ట స్ధాయి 13.4 శాతానికి చేరాయని వివరించారు. 2015-16 సంవత్సరానికి గాను కంపెనీ 10-12 శాతం ఆదాయ వృద్ధిని సాధిస్తుందని వెల్లడించారు.
అనంతరం ఇన్ఫోసిస్ సహావ్యవస్దాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి మాట్లాడుతూ ఇన్ఫోసిస్ కు అందించిన సేవలకు గాను విశాల్ సిక్కాను కొనియాడారు. కాగా, కంపెనీ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి తన భార్య సుధా మూర్తి, కుమారుడు రోహన్‌లతో కలిసి ఈ సమావేశానికి వచ్చారు.
1981లో ప్రారంభమైన ఇన్ఫోసిస్ కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశాల్లో వ్వవస్ధాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి డయాస్ పైనుంచి 30 సార్లకు పైగా ప్రసంగించారు. ఈ సారి మాత్రం షేర్ హోల్డర్లకు కేటాయించిన సీట్లలో, కుటుంబ సభ్యలతో కలిసి ముందు వరుసలో కూర్చున్నారు.

సిక్కాపై మూర్తి ప్రశంసలు: 'మళ్లీ మీరే రండి'
ఏజీఎమ్‌కు హాజరైన మూర్తిని మళ్లీ సంస్ధ బాధ్యతలు స్వీకరించాలని వాటాదార్లు డిమాండ్ చేశారు. కనీసం స్వతంత్ర డైరెక్టర్‌గా మూర్తి వ్యవహారించాలని కోరారు. అయితే తనపై ఉన్న ఆప్యాయతతోనే వారు ఈ మాటలంటున్నారని, తాను మళ్లీ బాధ్యతలను స్వకరించలేనని మూర్తి స్పష్టం చేశారు.

సిక్కాపై మూర్తి ప్రశంసలు: 'మళ్లీ మీరే రండి'
ప్రస్తుతం సమర్ధులైన వ్యక్తులు సంస్ధను నిర్వహిస్తున్నారని, వారికి అందరం మద్దతివ్వాలని సూచించారు. మూడు దశాబ్దాలుగా ఇన్వెస్టర్లు, ఇన్ఫీ షేర్ హోల్డర్ల పెట్టుబడులను ఇబ్బడి ముబ్బడిగా పెంచుతూ వారందరి మదిని దోచుకున్న నారాయణ మూర్తి రాగానే సీఈఓ విశాల్ సిక్కా ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.

సిక్కాపై మూర్తి ప్రశంసలు: 'మళ్లీ మీరే రండి'
ఇన్ఫోసిస్‌ను స్ధాపించిన ఆరుగురు వ్యవస్ధాపకులు ఎవరూ బోర్డులో లేకుండా జరిగిన మొదటి ఏజీఎమ్ సమావేశం ఇదే. ఎజిఎంలో పాల్గొన్న కృష్ణారావు అనే వాటాదారుడు నారాయణ మూర్తిని మళ్లీ ఇన్ఫోసిస్ బోర్డులోకి తీసుకురావాలని కోరారు.

సిక్కాపై మూర్తి ప్రశంసలు: 'మళ్లీ మీరే రండి'
ఒకానొక దశలో నినాదాలు ఎక్కువ కావడంతో ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ శేషసాయి, నారాయణ మూర్తి కంపెనీకి భీష్మ పితామహుని వంటి వారని, సలహా కోసం ఆయన్ని సంప్రదిస్తుంటామని చెప్పారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications