'ఫైర్42'ను కొనుగోలు చేసిన హలో కర్రీ (ఫోటోలు)
హైదరాబాద్: భారదేశపు ప్రముఖ ఫాస్ట్‌పుడ్ ఆహార సంస్ధ హలో కర్రీ, హైదరాబాద్ ఆధారిత సాంకేతికత సంస్ధ 'ఫైర్42'ను కొనుగోలు చేసింది. హలో కర్రీ సిఇఒ రాజు భూపతి, ఫౌండర్ సంతోష్ ఆచారిలు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ ఒప్పందం యొక్క వివరాలను తెలియజేశారు.
క్లౌడ్ మరియు మొబైల్ ఆధారిత పీఓఎస్ సేవలను అందిస్తున్న సంస్ధ రెస్టారెంట్లకు అనుగుణంగా మేనేజ్‌మెంట్, అనలిటిక్ టూల్స్, మార్కెటింగ్ టూల్స్, ఆపరేషన్ టూల్స్ మొదలైన సేవలను ఫైర్42 అందిస్తుంది. ఫైర్42 సంస్ధ అందిస్తున్న సెల్‌ప్లేమ్ సాంకేతికత ద్వారా రెస్టారెంట్ యజమాని తమ రెస్టారెంట్ లావాదేవీలను సులభంగా నమోదు చేసుకోవచ్చు.
ఈ సాంకేతికత ద్వారా రెస్టారెంట్లు ఆన్‌లైన్ పరంగా కూడా వ్యాపారాన్ని కొనసాగించేందుకు వీలుంటుంది. వచ్చే ఏడాదిన్నర కాలంలో దేశంలోని అన్ని నగరాలకు విస్తరించడమేకాకుండా యుఎస్, ఆస్ర్టేలియాలోనూ తమ కార్యకలాపాలను ప్రారంభించాలనుకుంటున్నట్టు హలో కర్రీ సిఇఒ రాజు భూపతి తెలిపారు.

'ఫైర్42'ను కొనుగోలు చేసిన హలో కర్రీ
ఇప్పటికే బెంగళూరులో రెండు, హైదరాబాద్‌లో ఆరు ఫుడ్ డెలివరీ కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాబోయే రెండు నెలల్లో ఢిల్లీ, ముంబైలో కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు.

'ఫైర్42'ను కొనుగోలు చేసిన హలో కర్రీ
క్లౌడ్, మొబైల్ ఆధారిత రెస్టారెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌ను అభివృద్ధి చేసిన హైదరాబాద్ సంస్థ ఫైర్42ను కొనుగోలు చేశామని అన్నారు. నగదు, షేర్ల రూపంలో ఈ కంపెనీని కొనుగోలు చేశామన్నారు. అయితే డీల్ విలువ ఎంతన్నది మాత్రం వెల్లడించలేదు.

'ఫైర్42'ను కొనుగోలు చేసిన హలో కర్రీ
ఫైర్42ను కొనుగోలు చేయడంతో దేశంలోనే తొలి ఫుడ్‌టెక్ స్టార్టప్‌గా అవతరించినట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం రోజుకు 800-1,000 ఆర్డర్లను పొందుతున్నామని, రానున్న కాలంలో ఆర్డర్ల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో ఫైర్42ను కొనుగోలు చేయాల్సి వచ్చిందన్నారు.

'ఫైర్42'ను కొనుగోలు చేసిన హలో కర్రీ
భవిష్యత్‌లో మరిన్ని కంపెనీలను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని రాజు తెలిపారు. ఈ ఏడాదిలో 10-12 కోట్ల రూపాయల రాబడిని నమోదు చేయాలన్న లక్ష్యంతో ఉన్నామని చెప్పారు.


Click it and Unblock the Notifications