పీఎఫ్ ఖాతాకు యూఎఎన్ తప్పనిసరి: ఈపీఎఫ్ఓ
ప్రావిడెంట్ ఫండ్‌లో సభ్యత్వమున్న ఉద్యోగ సంస్ధలు యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఎఎన్) తప్పనిసరి అంటూ ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్స్ అండ్ మిస్‌లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952 ప్రకారం యూఎఎన్‌ను కలిగి ఉండాల్సిందేనని ఈఫీఎఫ్ఓ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కెకె జలాన్ తెలిపారు.
ఈపీఎఫ్, ఎంపీ చట్ట ప్రకారం అన్ని సంస్ధలు యూఎఎన్‌ను తీసుకోవడం తప్పనిసరి చేస్తూ ముసాయిదా ఉత్తర్వులను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దీనికి సంబధించిన విధివిధానాలను ఆగస్టు 25వ తేదీ నాటికల్లా పూర్తి చేయాలని గడువు విధించినట్లు జలాన్ తెలిపారు.
నిబంధనలు పాటించని సంస్ధలపై ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్,1952 కింద చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగం మారిన ప్రతిసారి పీఎఫ్ అకౌంట్‌ను మార్చుకోకుండా ఉండేందుకు గాను, భుత్వం గత ఏడాది అక్టోబర్‌లో యుఎఎన్‌ను ప్రవేశపెట్టింది.

గతేడాది జులై నాటికి ఈపీఎఫ్ఓ నాలుగు కోట్ల మంది సభ్యులకు యూఎఎన్‌ను జారీ చేసినట్లు తెలిపారు. వీటితో పాటు పాన్ నెంబర్, బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్ వంటి కెవైసి వివరాలతో పీఎఫ్ ఖాతాకు లింక్ చేసింది.
కేంద్ర ప్రభుత్వం యూనివర్సల్ అకౌంట్ నెంబర్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 56.34 లక్షల మంది ఉద్యోగులు తమ పిఎఫ్ ఖాతాను పోర్టబుల్ చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ 2.8 కోట్ల యూఎఎన్ నెంబర్లు ఇచ్చేందుకుసిద్ధంగా ఉన్నా, ఖాతాదారులు వారి యొక్క బ్యాంక్ వివరాలను అందజేయడంలో విఫలమయ్యారని తెలిపారు. పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకునేందుకు బ్యాంకు ఖాతా తప్పనిసరి.


Click it and Unblock the Notifications