వంటింటి వ్యర్ధాలతో గ్యాస్ ఆదా చేయడం ఎలా?
వంటింటి వ్యర్ధాలను ఉపయోగించి, యల్.పి.జి గ్యాస్ ఆదా చేసుకునే సౌకర్యాన్ని హైదరాబాద్‌కు చెందిన పీపల్ ఇండస్ట్రీస్ ప్రైవెట్ లిమిటెడ్ అందుబాటులోకి తెచ్చింది. ఈ వంటింటి వ్యర్ధాలను ఉపయోగించి బయోడిజిస్టర్‌ను ఇంట్లో నెలకొల్పడం వల్ల నెలసరి గ్యాస్ వాడకంలో 70 శాతం వరకూ ఆదా అవుతుంది.
ముందుగా మీ ఇంట్లో మీరు దీనికి సంబంధించి ఒక బయోడిజిస్టర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి రోజు మన ఇంట్లో మిగిలిపోయిన అన్నం, కూరలు, కూరగాయ తొక్కలు, ఆకుకూర వ్యర్ధాలు, పళ్ళ తొక్కలు..... ఇంకా చెప్పాలంటే కుళ్లే స్వభావం ఉన్న ఏదైనా సరే ఈ బయోడిజిస్టర్‌లో ఉపయోగించొచ్చు.
అంతేకాదు ఈ వంటింటి వ్యర్ధాలను వాడటం ఇప్పుడు మరింత సులభతరం. దుర్వాసన రాదు. ఒక్కసారి ఇంటి పైకప్పు కానీ బాల్కనీలో ఏర్పాటు చేసుకుంటే జీవిత కాలం మొత్తం దీనిని ఉపోయోగించుకోవచ్చు. 20 సంవత్సరాల కాలానికి జీరో నిర్వహణ వ్యయం. మీరు పెట్టిన పెట్టుబడి మొత్తం 1.5 నుంచి 2 సంవత్సరాలలోపు రాబడిని రాబట్టుకోవచ్చు.
దీని వల్ల జీహెచ్ఎంసీ వాళ్ళకు తలనొప్పిగా, భాగంగా మారిన చెత్త సమస్యకు మీ అంతట మీరే చక్కటి పరిష్కారం చూపుతున్నారన్నమాట. నాలుగురూ ఏ విధంగా వంటింటి వ్యర్ధాలను చెత్తబుట్టలో పడెయ్యకపోతే, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది.
బయో టెక్నాలజీ రంగంలో ఎంతో గుర్తింపు పొందిన కిశోర్ రెడ్డి ఈ కంపెనీని స్ధాపించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నగరంలో చాలా సంస్ధల్లో, ఇళ్లలో ఈ బయోడిజిస్టర్‌లను నెలకొల్పినట్లు తెలిపారు. ఆ యా కస్టమర్లు వీటిని సులువుగా వినియోగించుకున్నట్లు తెలిపారు.
దీనికి సంబంధించిన పూర్తి సమాచారం, వివరాల కొరకు సంప్రదించండి
PEEPAL INDUSTRIES (P) LTD
208, Sai Pragathi Towers,
Himayatnagar, Hdyerabad- 20
Phone: +91 40 27602255
Cell: 9652832021, 8500226958, 9885114772
Email: [email protected]
www.peepalindustries.com


Click it and Unblock the Notifications
