For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కార్పోరేట్: యోగా డేలో మేము సైతం(ఫోటోలు)

By Nageswara Rao
|

తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రభుత్వ రంగ సంస్ధలు, బ్యాంకులు, పారిశ్రామిక సంఘాల నిర్వాహకులు, ఉద్యోగులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ దేశవ్యాప్తంగా సిబ్బందితో యోగా చేయించినట్లు ఓ ప్రకటనలో తెలియజేసింది.

ఇందులోభాగంగానే ముంబైలోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు, ఉన్నతాధికారులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి సంస్థ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య యోగా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరగడమేగాక, ఇది ఓ శాంతి సంకేతాన్ని ఇస్తుందన్నారు.

 యోగా డే: నేల నుంచి ఆకాశం దాకా

యోగా డే: నేల నుంచి ఆకాశం దాకా

తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రభుత్వ రంగ సంస్ధలు, బ్యాంకులు, పారిశ్రామిక సంఘాల నిర్వాహకులు, ఉద్యోగులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ దేశవ్యాప్తంగా సిబ్బందితో యోగా చేయించినట్లు ఓ ప్రకటనలో తెలియజేసింది.

యోగా డే: నేల నుంచి ఆకాశం దాకా

యోగా డే: నేల నుంచి ఆకాశం దాకా

ఒత్తిడితో కూడిన జీవనాన్ని సాగిస్తున్న నేటి మానవాళికి యోగా చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. ఎన్‌ఎమ్‌డిసి ఉద్యోగులు సైతం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. సంస్ధ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర కొఠారి శిక్షకుల పర్యవేక్షణలో యోగాలో పాల్గొన్నట్లు ఓ ప్రకటనలో ఎన్‌ఎమ్‌డిసి తెలిపింది.

యోగా డే: నేల నుంచి ఆకాశం దాకా

యోగా డే: నేల నుంచి ఆకాశం దాకా

హైదరాబాద్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు, సీనియర్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నట్టు తెలిపింది. భారతీయ యోగాకు అంతర్జాతీయ స్ధాయి గుర్తింపు తెచ్చి పెట్టిన ఘనత ప్రధాని నరేంద్రమోడీదేనని సిఐఐ పశ్చిమ ప్రాంత చైర్మన్ సంజయ్ కిర్లోస్కర్ ప్రశంసించారు.

యోగా డే: నేల నుంచి ఆకాశం దాకా

యోగా డే: నేల నుంచి ఆకాశం దాకా

ఇక చౌకధరల విమానయాన సంస్ధ స్పైస్‌జెట్ యోగా దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించింది. ఎగురుతున్న కొన్ని బోయింగ్ విమానాల్లో ఈష ఫౌండేషన్‌కు చెందిన యోగా నిపుణుల ఆధ్వర్యంలో తమ సిబ్బంది పది నిమిషాల పాటు యోగా చేసినట్లు సంస్ధ వెల్లడించింది.

English summary

కార్పోరేట్: యోగా డేలో మేము సైతం(ఫోటోలు) | On ground and in air, it’s Yoga Sunday for India Inc

According to the Confederation of Indian Industry (CII), several thousands of representatives of Indian industry, some with family, participated in various cities.
Story first published: Monday, June 22, 2015, 14:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X