బెంగళూరు: బెంగళూరులో నివాసం ఉంటున్న విశాఖపట్టణం ప్రాంతం ప్రజలకు శుభవార్త. కేవలం రూ. 999 చెల్లించి చక్కగా విమానంలో వైజాగ్ చేరుకోవడానికి అవకాశం వచ్చింది. అంతే కాకుండా రూ. 999 టిక్క్ ట్ తీసుకుని పలు నగరాలు చూడటానికి అవకాశం కల్పించారు.
ఎయిర్ ఏషియా ఇండియా సంచలన ఆఫర్ ఇచ్చింది. బెంగళూరు-వైజాగ్, బెంగళూరు-పూణె, బెంగళూరు-గోవాల మార్గాలలో విమానంలో సంచరించడానికి టిక్కెట్ ధర రూ. 999 నిర్ణయించింది. అయితే ఇది కేవలం ఆఫర్ మాత్రమే. ఈనెల 28వ తేది లోపు టిక్కెట్ లు బుక్ చేసుకోవాలి.

2016 ఫిబ్రవరి 15 నుండి 2016 ఆగస్టు 31వ తేది వరకు ఈ మార్గాలలో సంచరించడానికి ఇప్పుడే టిక్కెట్లు తీసుకోవలసి ఉంటుంది. ఇదే ఆఫర్ లో బెంగళూరు-న్యూఢిల్లీకి రూ.1,999, బెంగళూరు- చండీగడ్ కు రూ.1,799 టిక్కెట్ ధర నిర్ణయించారు.
బెంగళూరు-జైపూర్ కు రూ.1,599 నిర్ణయించారు. బెంగళూరు-కోచ్చికి అన్ని పన్నులతో కలిపి కేవలం రూ.799 ధర నిర్ణయించారు. ఇటివల ఎయిర్ ఇండియా స్వదేశీ ప్రయాణాల విభాగం టిక్కెట్ ను కేవలం రూ. 1,777 ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎయిర్ ఏషియా ఇండియా, స్పైస్ ఎయిర్ వేస్, స్పైస్ జెట్, ఇండిగో, గో ఎయిర్ తదితర సంస్థలు పలు ఆకర్షణీయమైన బంపర్ ఆఫర్ లు ఇస్తున్నాయి.


Click it and Unblock the Notifications