ఖాతాదార్ల వివరాలు వెల్లడించాలంటూ భారత్‌తో పాటు ఇతర దేశాల నుంచి స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ వ్వవస్ధపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, ఆ దేశాల్లోని బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న సొమ్ము గణనీయంగా తగ్గింది.
గత ఏడాది కాలంలో స్విస్‌బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న సంపద 10 శాతం తగ్గిందని స్విస్ నేషనల్ బ్యాంక్ (ఎస్‌ఎన్‌బి) ప్రకటించింది. గత ఏడాది స్విస్ బ్యాంకుల్లో భారతీయలు సొమ్ము 21.5 కోట్ల స్విస్ ఫ్రాంక్‌లు తగ్గి 180 కోట్ల స్విస్ ప్రాంక్లకు (సుమారు రూ. 12,615 కోట్లు) పరిమితమైనందని ఎస్ఎన్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
2012 తర్వాత స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద పడిపోవడం ఇదే ప్రథమం. ఆ ఏడాది స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము 142 కోట్ల స్విస్ ఫ్రాంక్‌లకు (8530 కోట్ల రూపాయలు) పడిపోయింది. ఇదే స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద కనిష్ఠ స్థాయి.

2013లో స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న సొమ్ము 40 శాతానికి పైగా పెరిగినప్పటికీ ఆ తర్వాత ఏడాది కాలంలో చోటు చేసుకున్న పరిణామం ఇది. భారతీయుల నిధులు స్విస్ బ్యాంకుల్లో ఇంత తక్కువ స్థాయిలో ఉండడం ఇది రెండో సారి.
స్విస్ బ్యాంకుల్లో విదేశీయుల సొమ్ము 2013లో రూ. 90 లక్షల కోట్లు కాగా, 2014లో ఇది రూ. 103 లక్షల కోట్లకు చేరింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications