చైనాను అధిగమించి అగ్రగామిగా భారత్: వరల్డ్ బ్యాంక్
ఈ ఏడాది 7.5 శాతం వృద్ధి రేటుతో భారత్ తొలిసారిగా చైనాను అధిగమించి వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థల్లో అగ్రగామిగా నిలుస్తుందని ప్రపంచబ్యాంకు తాజాగా అంచనావేసింది. 7.5 శాతం వృద్ధిని సాధించగల సత్తా ఉన్న భారత్‌కు ఉందని పేర్కొంది.
వృద్ధి రేటులో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల సరసన భారత్‌కు ఈ స్థానం దక్కడం ఇదే తొలిసారని ప్రపంచ ఆర్థిక వ్యవస్థల వృద్ధి అవకాశాల (జిఇపి) నివేదికను విడుదల చేసిన సందర్భంగా ప్రపంచబ్యాంకు చీఫ్ ఎకనామిస్ట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కౌశిక్‌బసు చెప్పారు.
ఈ ఏడాది చైనా 7.1 శాతం, వర్థమాన ఆర్థిక వ్యవస్థలన్నీ కలిసి 4.4 శాతం వృద్ధిని సాధించవచ్చని ఆ నివేదికలో ప్రపంచబ్యాంకు అంచనా వేసింది. కాగా వర్థమాన ఆర్థిక వ్యవస్థల వృద్ధిరేటు 2016లో 5.2 శాతం, 2017లో 5.4 శాతం ఉండవచ్చని పేర్కొంది.

చైనా మాత్రం మందగమనాన్ని నిరోధించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఈ ఏడాది 7.1 శాతం వృద్ధితో సరిపెట్టుకుటుందని తెలిపింది. ప్రపంచంలో ఆయిల్ దిగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న భారత్‌కు ఆయిల్ ధరలు అదుపులో ఉండడం వల్ల భారత్ వృద్ధి రేటు మెరుగు పడటంలో దోహదపడిందన్నారు.
దీంతో పాటు ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ఆర్థికవ్యవస్థపై విశ్వాసాన్ని పెంచాయని, ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ మెరుగైన వృద్ధిపథంలో నిలిచేందుకు దోహదపడే అంశాలని ఆ నివేదికలో విశ్లేషించారు. వీటితో పాటు సానుకూలతలో కూడా అమెరికా వడ్డీరేట్ల పెంపు అవకాశాలు భారత్‌తో పాటు వర్థమాన దేశాలకు ఒక సవాల్‌గా నిలవనున్నట్లు కౌశిక్ బసు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications