గల్ఫ్ నుంచి పంపిన సొమ్ము 10వేల కోట్ల డాలర్లు
గల్ఫ్ దేశాల్లో బతుకు తెరువు కోసం వివిధ పనుల నిమిత్తం ప్రపంచ వ్యాప్తంగా అక్కడకు వెళ్లిన విదేశీయుల సంఖ్య 2.5 కోట్లు. వీరంతా గతేడాది గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా రెమిటెన్స్ రూపంలో రూ. 10 వేల కోట్ల డాలర్లు పంపినట్టు ఓ నివేదిక వెల్లడించింది.
ఈ రెమిటెన్స్‌ను పంపిన వారిలో భారతీయలు కూడా చాలా మంది ఉన్నారు. 2010 సంవత్సరంతో పోలిస్తే గతేడాదిలో పంపిన సొమ్ము రెండింతలు అధికం కావడం విశేషం. ఈ సొమ్ము గల్ఫ్ దేశాల (బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ఉమ్మడి జిడిపిలో 6.2 శాతానికి సమానమని పేర్కొంది.

రెమిటెన్స్ స్ధానంలో మొట్టమొదటి స్ధానంలో సౌదీ అరేబియా ఉంది. సౌదీ అరేబియాలో ఉన్న కోటి మంది విదేశీయులు 4,400 కోట్ల డాలర్లు తమ దేశాలకు పంపించారు. ఆ తర్వాతి స్ధానంలో 2,900 కోట్ల డాలర్లతో యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ ఉంది.
గల్ఫ్ దేశాల్లో పనిచేస్తోన్న వారిలో ఎక్కువ మంది భారత్ నుంచి ఉండటం విశేషం. ఆ తర్వాతి స్ధానాల్లో స్థానాల్లో ఈజిప్టు, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, పాకిస్తానీయులు ఉన్నట్టు నివేదికలో పేర్కొంది.


Click it and Unblock the Notifications