కళ్ళు తిరిగేలా టీసీఎస్ సీఈఓ చంద్రశేఖరన్ వేతనం
మనదేశంలో ఐటీ కంపెనీల సీఈఓల జీతాలు చూస్తుంటే కళ్లు తిరుగుతున్నాయి. భారత్‌లో అత్యధికంగా కాగ్నిజెంట్ ఇండియా సీఈఓ ఫ్రాన్సిస్కో డిసౌజా 2014-15 లో ఏకంగా 1.10 కోట్ల డాలర్లు (సుమారు రూ.70.4 కోట్లు) జీతంగా తీసుకుని మొదటి స్ధానంలో నిలిచారు.
ఆ తర్వాత టీసీఎస్ సీఈఓ చంద్రశేఖరన్ రూ. 21.28 కోట్లతో రెండో స్ధానంలో నిలిచారు. గతేడాదితో పోలిస్తే 14 శాతం ఎక్కువగా కంపెనీ ఆయన వేతనాన్ని పెంచింది. గతేడాది ఇన్ఫోసిస్ సీఈఓగా విశాల్ సిక్కా పగ్గాలు చేపట్టిన తర్వాత ఐటీలో అత్యధిక వేతనం అందుకున్న సీఈఓ చంద్రశేఖరనే.
ఇన్ఫోసిస్ సీఈఓ విశాల్ సిక్కాకు కంపెనీ రూ. 30 కోట్లు చెల్లించిందని సమాచారం. ఇక గతేడాది టీసీఎస్ సీఈఓ చంద్రశేఖరన్ తీసుకున్న మొత్తం రూ.21.28 కోట్లలో రూ.1.79 కోట్లు జీతం రూపంలో, రూ.2.62 కోట్లు ప్రోత్సాహకాలు, రూ.86 లక్షలు ఇతర ప్రయోజనాలు, రూ.16 కోట్లు కమిషన్ రూపంలో తీసుకున్నారు.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అక్టోబర్, 2009లో చంద్రశేఖరన్‌ను కంపెనీ సీఈఓగా ప్రకటించింది. ఆయన సీఈఓ బాధ్యతలు చేపట్టిన తర్వాత కంపెనీ టర్నోవర్ రూ.30,0029 కోట్ల నుంచి రూ.94,648 కోట్లకు పెరిగింది.
టీసీఎస్ సీఈఓ చంద్రశేఖరన్ తర్వాత కంపెనీలో అత్యధికంగా సీఎఫ్ఓ రాజేశ్ గోపీనాథ్ రూ.2.14 కోట్ల జీతం అందుకున్నారు. ఐటీ దిగ్గజం విప్రో కంపెనీ సీఈఓ టీకే కురియన్‌కు గతేడాది రూ. 9.3 కోట్లను చెల్లించింది.


Click it and Unblock the Notifications