హెచ్ఎస్‌బీసీ: 25వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన
ఖర్చులు తగ్గించడం, వాటాదారులను తిరిగి రప్పించేందుకు గాను ప్రపంచ వ్యాప్తంగా 25 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్‌బీసీ వెల్లడించింది. దీంతో ఒక్క లండన్‌లోనే 8000 మంది తమ ఉద్యోగాలను కోల్పోనున్నారు.
దీనిపై సంస్ధ హెచ్ఎస్‌బీసీ సీఈఓ సువర్ట్ గులివర్ మాట్లాడుతూ ఈ చర్యల ఫలితంగా రానున్న రెండేళ్లలో 5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 32వేల కోట్లు) ఆదా చేస్తామని వెల్లడించారు. అంతేకాదు బ్రెజిల్ టర్కీ దేశాల నుంచి తమ కార్యాలయాలను పూర్తిగా విరమించుకోనున్నట్లు తెలిపారు.
ప్రధాన కార్యాలయాన్ని లండన్ నుంచి తరలించనున్నామని హెచ్ఎస్‌బీసీ సంస్ధ హాంకాంగ్ స్టాక్ ఎక్సేంజ్‌కి వెల్లడించింది. బ్యాంకుని ప్రారంభించి 150 సంవత్సరాలైన సందర్భంగా తదుపరి దశ సాంకేతికతను అందుకునే దిశగా అడుగులు వేశామని పేర్కొంది.

బ్యాంకుల్లో వచ్చిన ఆటోమేషన్ టెక్నాలజీ కారణంగా ఉద్యోగుల సంఖ్య తగ్గించుకున్నామని తెలిపారు. హెచ్ఎస్‌బీసీ సీఈఓగా గులివర్ 2011లో బాధ్యతలు చేపట్టిన తర్వాత 2,96,000గా ఉన్న ఉద్యోగుల సంఖ్యను 2,57,000కు కుదించారు.
ప్రస్తుతం హెచ్ఎస్‌బీసీ ఉద్యోగుల సంఖ్య 208,000గా ఉంది. ఆసియా మార్కెట్‌లో డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఈ సంఖ్య మరింతగా తగ్గనుంది.


Click it and Unblock the Notifications