మహిళలకు ఎస్‌బీఐ నజరానా: 'హర్ ఘర్ హర్ కార్' స్కీం
ముంబై: దేశీయ అతి పెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) మహిళల కోసం ప్రత్యేకించి 'హర్ ఘర్ హర్ కార్' పథకాన్ని ప్రవేశపెట్టింది. 'హర్ ఘర్ స్కీమ్' కింద గృహరుణం పొందిన మహిళలు 10 శాతానికే కారు కోనుగోలు చేసేందుకు రుణం పొందవచ్చని పేర్కొంది.
ఈ పథకం కింద వడ్డీ రేటుని పావు శాతం తగ్గిస్తున్నామని ఎస్‌బీఐ సోమవారం తెలిపింది. అదే ఈ పథకం పరిధిలోనికి రాని మహిళలకు మాత్రం 10.25 శాతం వర్తిస్తుందని ఎస్‌బీఐ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 'హర్ ఘర్' పథకం కింద మహిళలకు ఇచ్చే గృహ రుణాలపై వడ్డీ రేటుని 10.10 శాతం నుంచి 9.85 శాతానికి తగ్గించింది.

జూన్ 4, 24 తేదీల్లో ఎస్‌బీఐ ఉద్యోగుల సమ్మె
ఎస్‌బీఐకి చెందిన ఐదు అనుబంధ బ్యాంకుల ఉద్యోగుల యూనియన్లు జూన్ 4, 24 తేదీల్లో సమ్మె చేయనున్నట్లు ప్రకటించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో అనుబంధ బ్యాంకులను విలీనం చేయడాన్ని యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి.
జూన్ 24న సమ్మెకు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర బ్యాంకుల ఉద్యోగుల మద్దతు కోరుతున్నాయి. ఎస్‌బీఐకి అనుబంధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాల పనిచేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications