ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల్లో భారత్‌కు చెందిన నలుగురు చోటు సంపాదించారు. ఫోర్బ్స్ విడుదల చేసిన 12వ వార్షిక జాబితాలో ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య, ఐసిఐసిఐ బ్యాంక్ చీఫ్ చందా కొచ్చర్, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా, హెచ్‌టి మీడియా అధిపతి శోభనా భార్తియా చోటు దక్కించుకున్నారు.
ఈ జాబితాలో జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ మొదటి స్ధానంలో నిలిచారు. అమెరికాకు చెందిన హిల్లరి క్లింటన్ రెండో స్థానంలో నిలువగా, మూడవ స్ధానంలో మిలిండా గేట్స్ నిలిచారు. వ్యాపార రంగంలో విశేషంగా కృషి చేసినవారు, రాజకీయం, రోల్ మోడల్స్, కుబేరులు, మార్గదర్శకులతో ప్రపంచాన్ని సమూలంగా మార్చివేసే శక్తి ఉన్న మహిళలతో ఈ నివేదికను ఫోర్బ్స్ రూపొందించింది.

100 మందిలో భారత్ నుంచి నలుగురు
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ మొదటి స్ధానంలో నిలిచారు.

100 మందిలో భారత్ నుంచి నలుగురు
గత ఏడాదితో పోలిస్తే, అరుంధతీ భట్టాచార్య, చందాకొచ్చర్, మజుందార్ షా ముగ్గురూ తమ తమ స్ధానాలను మెరుగు పరుచుకున్నారు. గతేడాది భట్టాచార్య 36వ స్థానంలో, కొచ్చర్ 43వ స్థానంలో, కిరణ్ 92వ స్థానంలో ఉన్నారు. ఇంద్రానూయి 15వ స్థానంలో, వారియర్ 84వ స్థానంలో నిలిచారు.

100 మందిలో భారత్ నుంచి నలుగురు
ఈ జాబితాలో భారతీయ సంతతికి చెందిన మరో ఇద్దరు మహిళలు- పెప్సికో చీఫ్ ఇంద్రా నూయి, సిస్కో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పద్మశ్రీ వారియర్ కూడా ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో అరుంధతీ భట్టాచార్య 30వ స్థానంలో, చందాకొచ్చర్ 35వ స్థానంలో, మజుందార్ షా 85వ స్థానంలో, భార్టియా 93వ స్థానంలో నిలిచారు.

100 మందిలో భారత్ నుంచి నలుగురు
ఈ 100 మందిలో 8 మంది దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నవారే. 24 మంది కార్పోరేటు సంస్ధల సీఈఓలు కాగా, 18 మంది సొంతంగా సంస్ధలు, ఫౌండేషన్‌లు స్ధాపించారు. ఆసియా ఫసిఫిక్ ప్రాంతానికి చెందిన వారు 18 మంది కాగా, లాటిన్ అమెరికా నుంచి 4గురు, ఐరోపా ప్రాంతం నుంచి 12 మంది, ఆఫ్రికా నుంచి ముగ్గురు ఈ జాబితాలో ఉన్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications