దేశీయ అతి పెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ తాజాగా 'వాయిస్' పాస్‌వర్డ్ ఆధారిత సేవలను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఫోన్ బ్యాంకింగ్ లావాదేవీలు జరిపేటప్పుడు, వినియోగదారుడి గొంతు గుర్తించి లావాదేవీలు నిర్వహించే సౌలభ్యం ఉంటుందని ప్రకటించింది.
పిన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లు టైప్ చేయాల్సిన అవసరం లేకుండా, ఖాతాదారుల వాయిసే పాస్‌వర్డ్‌గా ఉపయోగపడుతుంది. బ్యాంక్ కాల్‌సెంటర్ ద్వారా ఈ లావాదేవీలు చేయవచ్చని ముంబైలోని ఐసీఐసీఐ బ్యాంకు ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఇందుకోసం, కస్టమర్ల వాయిస్ ప్రింట్‌ను బ్యాంకు ముందుగా సేకరిస్తుంది. వాయిస్ మాడ్యులేషన్, వేగం, మాటతీరు, ఉచ్చారణ తదితర వంద రకాల అంశాలను పరిగణనలోకి తీసుకొని ఒకరి మాట తీరు మరొకరు అనుకరించినా గుర్తుపట్టే విధంగా ఈ సర్వీసును రూపొందించినట్లు ఐసీఐసీఐ బ్యాంకు ఛైర్మన్ చందా కొచ్చర్ తెలిపారు.

దీనివల్ల ఫోన్ బ్యాంకింగ్ లావాదేవీలు మరింత సురక్షితంగా జరపవచ్చని అన్నారు. స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగించే కస్టమర్లు 16 అంకెల కార్డు నంబరును, 4 అంకెల పిన్ నంబరును తప్పులు లేకుండా ఎంటర్ చేయడంలో ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో ఈ వాయిస్ ఆధారిత సర్వీసు ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
బ్యాంకులో నమోదు చేసుకున్న మొబైల్ నంబర్ నుంచి వినియోగదారుడు ఎప్పుడైనా కాల్ చేస్తే, సదరు వాయిస్ ప్రింట్‌తో సరిపోల్చి చూసుకుని తదుపరి లావాదేవీలకు అనుమతినిస్తుంది. ఈ సర్వీసు ద్వారా లావాదేవీలకు మరింత భద్రత చేకూరుతుందని, వినియోగదారులకు సౌలభ్యం, భద్రత లభిస్తాయని ప్రకటనలో ఐసీఐసీఐ బ్యాంకు పేర్కొంది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications