ముంబై: కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ బకాయిలపై ప్రభుత్వ రంగ బ్యాంకు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యుబీఐ) ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తోంది. కింగ్ ఫిషర్ చెల్లించాల్సిన బకాయిలపై యుబీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ పీ.శ్రీనివాస్ మాట్లాడుతూ ‘‘ కింగ్‌ఫిషర్ ఎకౌంట్‌పై ఎలాంటి నగదు వచ్చేలా లేదు. ముంబైలోని కింగ్‌ఫిషర్ హౌస్‌ను అమ్మితే కొద్ది మొత్తంలో డబ్బు వచ్చేలా ఉంది'' అని చెప్పారు.
‘‘మేమిచ్చిన మొత్తం 400 కోట్ల రూపాయల అప్పుపై చివరకు మహా అయితే వడ్డీ మాత్రమే దక్కేట్టుంది. అసలుపై ఆశలు వదులుకోవాల్సిందే'' అని అన్నారు. విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్‌కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కన్సార్షియంలోని మొత్తం 17 బ్యాంకులు రూ. 7,500 కోట్లు రుణాలుగా ఇచ్చాయి.
ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు సంయుక్తంగా రూ. 800 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 650 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 550 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 410 కోట్లు రుణంగా ఇచ్చాయి. రుణం తీసుకున్న కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మాత్రం రూ. 1,000 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించింది.

అప్పుల భారంతో 2012లో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కంపెనీ మూత పడటంతో మగిలిన రూ. 6,500 కోట్లు, వడ్డీ వసూలు చేసుకోలేక బ్యాంకులు నానా అవస్ధలు పడుతున్నాయి. బ్యాంకుల నుంచి రుణం తీసుకునేటప్పుడు హామీగా పెట్టిన ఆస్తుల విలువ వడ్డీకే సరిపోవడంతో ఈ బకాయిలు ఎలా వసూలు చేసుకోవాలో బ్యాంకులకు పాలుపోవడం లేదు.
అంతక ముందు విజయ్ మాల్యా, మరో ముగ్గురు డైరెక్టర్లను ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ప్రకటించింది. విజయ్ మాల్యాకు రుణం ఇచ్చిన సంస్థల్లో, ఈ ప్రకటన చేసిన తొలి బ్యాంకుగా యూబీఐ నిలిచిన సంగతి తెలిసిందే.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విజయ్ మాల్యా, మరో ముగ్గురు డైరెక్టర్లు రవి నెడుంగాడి, అనిల్‌కుమార్ గంగూలీ, సుభాష్ గుప్తేలను ఉద్దేశపూర్వక ఎగవేతదార్లుగా పరిగణిస్తున్నట్లు యూబీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపక్ నారంగ్ చెప్పారు. బ్యాంకుకు చెందిన ఫిర్యాదుల పరిష్కార విభాగం (జీఆర్‌సీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications