ఎయిర్ ఏషియా కొత్త ఆఫర్: ఒక రూపాయితో ఒక కిలోమీటర్
బెంగుళూరు: బెంగుళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎయిర్ ఏషియా రూపాయికి కిలోమీటరు దూరం ప్రయాణించండని వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. తాజాగా ఎయిర్ ఏషియా ఢిల్లీ నుంచి సర్వీసులను ప్రారంభించింది.
ఈ సందర్భంగా కొత్త ఆఫర్‌ని ప్రకటిస్తున్నట్టు వెల్లడించింది. ఈ నెల 24వరకూ ఈ ఆఫర్‌ను వాడుకొని టిక్కెట్లను బుక్ చేసుకొవచ్చని, ప్రయాణ తేదీ జూన్ 18 నుంచి వచ్చే సంవత్సరం మే 31 మధ్య ఉండాలని వెల్లడించింది.
ఈ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా న్యూఢిల్లీ, గౌహతి మధ్య రూ. 1500కి, గోవా, బెంగుళూరులకు రూ. 1700లకే(అన్ని కలిపి) విమాన ప్రయాణం చేయవచ్చు. ఇక విశాఖపట్నం, బెంగుళూరు మధ్య విమాన సర్వీసును ప్రారంభిస్తున్నట్లు ఎయిర్ ఏషియా ఇండియా ప్రకటించింది.
ఛార్జీ రూ. 1400. జూన్ 18 నుంచి వచ్చే సంవత్సరం మే 31 మధ్య ప్రయాణించడానికి వీలుగా ఈనెల 24 వరకు, మే 2015 వరకూ కొనుగోలు చేసే టిక్కెట్లకు ఈ ప్రత్యేక ధర వర్తిస్తుందని కంపెనీ ప్రకటనలో తెలిపింది.

మంగళవారం మినహా మిగిలిన రోజుల్లో బెంగుళూరులో సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి 6.10 గంటలకు విశాఖపట్నానికి చేరుతుంది. విశాఖపట్నంలో సాయంత్రం 6.40 గంటలకు బయలుదేరి రాత్రి 8.10 గంటలకు బెంగుళూరు చేరుతుంది.
ఇక మంగళవారం మాత్రం బెంగుళూరులో సాయంత్రం 6.25 గంటలకు బయలుదేరి రాత్రి 8.00 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది. మళ్లీ తిరిగి 8.25 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి రాత్రి 10 గంటలకు బెంగుళూరు చేరుతుంది.


Click it and Unblock the Notifications