దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి అన్ని రకాల సేవలూ మరింత ప్రియం కానున్నాయి. ఇందుకు కారణం ఇప్పటి వరకు 12.36 శాతంగా ఉన్న సర్వీసు ట్యాక్స్‌ను 14 శాతానికి పెంచుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2015-16 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రతిపాదించారు. పార్లమెంట్ ఇందుకు ఆమోదం తెలపడంతో జూన్ 1 నుంచి దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రెస్టారెంట్‌లలో తినడం:
జూన్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒక మాదిరి హోటల్‌కి వెళ్లి టిఫిన్ చేసినా ఆ బిల్లుపై అదనంగా 14 శాతం సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తారు. గతంలో ఈ సర్వీస్ ట్యాక్స్ 12.36 శాతంగా ఉండేది. పెరిగిన సర్వీస్ ట్యాక్స్ మూలంగా జూన్ 1 నుంచి హోటల్‌లో తినడం లాంటివి పెనుభారంగా మారనున్నాయి.
మొబైల్ బిల్లులు:
సర్వీస్ ట్యాక్స్ పెరగడం వల్ల మొబైల్ బిల్లులు మరింత భారం కానున్నాయి. ముఖ్యంగా మొబైల్ ఫోన్ రీఛార్జ్ కూపన్ ధర సైతం పెరగనుంది.

విమాన ప్రయాణం:
సర్వీస్ ట్యాక్స్ పెరగడం వల్ల విమాన ప్రయాణం మరింత భారం కానుంది. జూన్ 1 నుంచి విమాన ప్రయాణాలపై 14 శాతం సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తారు. వీటితో పాటు మరికొన్ని సేవలపై కూడా సర్వీస్ ట్యాక్స్ భారం పడునుంది. అవేంటో చూద్దాం.
1. డీటీహెచ్ సర్వీసులు
2. బ్యూటీ పార్లర్
3. ఇన్సూరెన్స్
4. స్టాక్ బ్రోకరేజ్ సర్వీసులు
5. కొరియర్ సర్వీసు
6. లాండ్రీ సర్వీసు
7. ఆర్కిటెక్ట్‌ల సేవలు
8. ప్రకటనల బిల్లులు
9. క్రెడిట్ కార్డు బిల్లులు
ఈ ఏడాది పార్లమెంట్లో 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీ 12.36 శాతంగా ఉన్న సర్వీసు ట్యాక్స్‌ను 14 శాతానికి పెంచుతున్నట్టు బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. కేవలం అతి తక్కువ సేవలకే ఈ సేవాపన్ను మినహాయింపునిచ్చారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications