రూ. 16,400 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసిన ఎల్‌ఐసీ
News
oi-Nageshwara
By Nageswara Rao
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) జనవరి నుంచి మార్చి త్త్రైమాసికానికి గాను 12 సెన్సెక్స్ షేర్లలో తన వాటాను పెంచుకుంది. ఈ వాటాని పెంచుకునేందుకు గాను రూ. 16,400 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది.
ఇది ఇలా ఉంటే ఇదే త్ర్రైమాసికంలో మరో 12 సెన్సెక్స్ షేర్లలో వాటాలను తగ్గించుకుంది. అందుకు గాను రూ. 6,730 కోట్ల విలువైన షేర్లను విక్రయించింది. దీంతో గత కొన్ని త్ర్రైమాసికంగా యాక్సిస్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలివర్ కంపెనీల్లో ఎల్‌ఐసీకి ఎలాంటి వాటా లేదు.
టాటా స్టీల్, భెల్, వేదాంత, టాటా మోటార్స్ కంపెనీల్లో ఎల్‌ఐసీ వాటాల్లోని షేర్లలో ఎలాంటి మార్పు లేదు. తాజాగా కొనుగోలు చేసిన షేర్లతో కోల్ ఇండియాలో అత్యధికంగా తన వాటాను 4.65 శాతానికి పెంచుకుంది.
కోల్ ఇండియా ఆఫర్ సేల్‌లో భాగంగా రూ. 10,754 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది. ఈ తాజా షేర్లతో కోల్ ఇండియాలో సగం షేర్లను ఎల్‌ఐసీనే కొనుగోలు చేసింది. సెన్సెక్స్ కంపెనీల్లో ఎల్‌ఐసీకి అత్యధిక వాటా ఉన్న కంపెనీగా ఎల్ అండ్ టీ నిలిచింది. ఎల్ అండ్ టీలో సెన్సెక్స్‌కు 16.73 శాతం వాటా ఉంది.