నల్లధనాన్ని స్వదేశానికి రప్పించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం అనేక మార్గాలను ఎంచుకుంటుంది. ఇందులో భాగంగానే అక్రమంగా విదేశాల్లో ఆస్తులు, బ్యాంకుల్లో ఖాతాలు కలిగి ఉన్న భారతీయుల కోసం విదేశీ ఆదాయ, ఆస్తులు (పన్ను విధింపు) బిల్లు, 2015కు లోక్‌సభ సోమవారం ఆమోద ముద్ర వేసింది.
ఇక రాజ్యసభ కూడా ఆమోదం తెలిపితే ఈ బిల్లు చట్టంగా మారుతుంది. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై లోక్‌సభలో కొద్ది సేపు చర్చ జరిగిన తర్వాత ఆమోదం పొందింది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఆరుణ్ జైట్లీ మాట్లాడుతూ బిల్లుని ఆమోదించడంలో ఏ మాత్రం ఆలస్యం అయినా విదేశాల్లోని బ్యాంకుల్లో మూలుగుతున్న అక్రమ సంపాదన ఇతర దేశాలకు తరలించే ప్రమాదం ఉందన్నారు.
ఇలా జరిగితే మళ్లీ వాటిని కనుక్కోవడం కష్టమని చెప్పారు. ప్రభుత్వానికి వెల్లడించకుండా ఎవరికైనా విదేశీ బ్యాంకుల్లో రూ.5 లక్షల వరకు నిధులున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమి చెప్పారు. దేశ సంపదను కొల్లగొట్టి విదేశీ బ్యాంకుల్లో అక్రమంగా దాచుకునే పెద్ద చేపలపైనే తప్ప, చిన్న చిన్న మొత్తాలు దాచుకున్న వారిని వేధించాలనేది తమ ఉద్దేశ్యం కాదని చెప్పారు.

నల్లధనం బిల్లు ముఖ్యాంశాలు:
* బిల్లులోని నిబంధనల ప్రకారం ఎవరైనా భారతీయులు అక్రమంగా విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు, ఆస్తులు కలిగి ఉంటే వాటిపై 120 శాతం మేర అపరాధ పన్నుతో పాటు, మూడు నుంచి 10 ఏళ్ల పాటు జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సి ఉంటుంది.
* అయితే ఈ బిల్లు చట్టంగా మారి అమల్లోకి వచ్చిన వెంటనే రెండు నెలల్లో తమ అక్రమ విదేశీ ఆస్తులు, బ్యాంక్‌ఖాతాల వివరాలు వెల్లడిస్తే జైలు శిక్ష తప్పనుంది.
* పన్నుల భారం కూడా 120 శాతం నుంచి 60 శాతానికి తగ్గుతుందని ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పారు. బినామీ పేర్లతో దేశంలోనే నల్ల ధనాన్ని చలామణి చేస్తున్న వారి ఆటకట్టించేందుకు వీలు కలుగుతుంది.
* విదేశాల్లో దాచిన సొమ్ముకు సమానమైన విలువ కలిగిన ఆస్తులను జప్పు చేయడానికి కూడా కొత్త చట్టం వెసులుబాటు కల్పిస్తుంది.
* దేశంలో నల్లధనం సృష్టిని కట్టడి చేసేందుకు గాను కొత్తగా 'బినామీ బిల్లు'ను తెస్తామని, దీన్ని త్వరలో కేబినెట్ ఆమెదానికి పెడతామని వివరించారు.
* పన్ను వసూళ్లను ఇది మెరుగుపరుస్తుందని, పన్ను రేట్లను తగ్గించడానికి వీలు కల్పిస్తుందన్నారు.
* రూ. లక్షకు పైగా జరిగే అన్ని లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి చేశారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications