బ్రిక్స్ దేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న బ్యాంకుకు అధ్యక్షుడిగా ఐసీఐసీఐ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కేవీ కామత్ నియమితులయ్యారు. ఈ బ్యాంకుకు కేవీ కామత్‌ను అధ్యక్షుడిగా నియమించినట్టు ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రిషి తెలిపారు. ఈ పదవిలో కామత్ ఐదేళ్ళు కొనసాగుతారు.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయన పేరుని ఖరారు చేసింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా కలిసి బ్రిక్స్ బ్యాంకును ఏర్పాటు చేసుకున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు కల్పించే లక్ష్యంగా గతేడాది బ్రెజిల్‌లో జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశాల్లో ఈ బ్యాంకు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.

అంతేకాదు వంద బిలియన్ డాలర్ల అభివృద్ధి బ్యాంకుకు భారత్ అధ్యక్షత వహించేందుకు అంగీకారం కుదిరిన సంగతి తెలిసిందే. 67 ఏళ్ల కామత్ 1971లో ఐసీఐసీఐ బ్యాంక్‌లో తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్‌కి వెళ్లి కొంతకాలం సేవలందించారు.
తిరిగి మళ్లీ 1996లో ఐసీఐసీఐ ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. 2009లో ఆ పదవి నుంచి రిటైరై నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఛైర్మన్‌గా కూడా కొనసాగుతున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications