ముంబై: ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన భారతీయుడిగా తిరిగి రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఫోర్బ్స్ మ్యాగజైన్ తాజాగా సవరించిన ధనికుల జాబితా వివరాల ప్రకారం అయన సంపద 1,960 కోట్ల డాలర్లుగా నమోదైంది. దాదాపు ఏడు వారాలపాటు మొదటి స్థానంలో నిలిచిన సన్‌ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వీ రెండో స్థానానికి పడిపోయారు.
స్టాక్ మార్కెట్‌లో సోమవారం కంపెనీల షేర్ల ధరల్లో వచ్చిన మార్పులే ఇందుకు కారణమని ‘ఫోర్బ్స్' తెలిపింది. గతవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.55 శాతం నష్టపోయింది. కానీ సన్‌ఫార్మా షేర్లు 2 శాతం క్షీణించడంతో 45 కోట్ల డాలర్లు నష్టపోయిన సంఘ్వీ సందప 1,930 కోట్ల డాలర్లకు తగ్గింది. దీంతో ప్రపంచవ్యాప్త జాబితాలో ముకేశ్ అంబానీ 46వ స్థానంలో, సంఘ్వీ 48వ స్థానంలో ఉన్నారు.

గ్లోబల్ టాప్-50లో వీరిద్దరికి మాత్రమే స్థానం దక్కింది. గతనెల 2న ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రస్తుత సంవత్సరానికి ప్రపంచవ్యాప్త ధనికుల జాబితాను ప్రకటించింది. అందులో ముకేశ్ 39వ స్థానంలో, సంఘ్వీ 44వ స్థానంలో నిలిచారు. అయితే స్టాక్ మార్కెట్ పరిణామాలతో రెండు రోజుల్లోనే సంఘ్వి ప్రపంచంలో అత్యంత సంపన్నుడైన భారతీయుడిగా మొదటి స్థానానికి చేరుకుంటే అంబానీ రెండో స్థానానికి పడిపోయారు.
మళ్లీ అదే స్టాక్ మార్కెట్ మార్పులతో ఇపుడు అంబానీ మొదటి స్థానానికి, సంఘ్వి రెండో స్థానానికి చేరారు. తాజా సమాచారం ప్రకారం.. అజీమ్ ప్రేమ్‌జీ మూడో స్థానంలో ఉండగా.. స్టీల్ టైకూన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ నాలుగో స్థానంలో ఉన్నారు. హెచ్‌సీఎల్ చైర్మన్ శివ్‌నాడార్ ఐదో స్థానంలో నిలిచారు. కుమార మంగళం బిర్లా, ఉదయ్ కొటక్, సునీల్ మిట్టల్, సైరస్ పూనావాలా, గౌతమ్ అదానీలు టాప్ పది స్థానాల్లో ఉన్నారు.
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ సుమారు రూ. 50,97,444 కోట్ల ఆస్తులతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. స్టాక్ మార్కెట్ మార్పులతో గత ఏడు వారాల్లో గేట్స్ ఆస్తుల విలువ 7,920 కోట్ల డాలర్ల నుంచి 8,000.3 కోట్ల డాలర్లగా ఉంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications