పాన్ కార్డు కోసం దరఖాస్తు కోసం కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఆన్‌లైన్ విధానంలో కేవలం 48 గంటల్లోనే పాన్ కార్డు జారీ చేయనున్నట్లు ఉన్నాతాధికారి ఒకరు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వారు సైతం పాన్ కార్డులు పొందేందుకు వీలుగా ప్రత్యేకంగా క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
మనదేశంలో పాన్ కార్డుని ఐటీ శాఖ జారీ చేస్తుంది. పాన్ కార్డుని పొందేందుకు ఓటరు గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డు ఉండే సరిపోతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు ఇటీవలే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌లు సమర్పించాలన్నా, నిర్ధిష్ట విలువకు మించి ఆస్తులు, వాహనాల క్రమ, విక్రయాలు జరపాలన్నా పాన్ కార్డుని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
2015వ సంవత్సరంలో ప్రకటించిన ఫైనాన్స్ చట్ట ప్రకారం రూ. లక్షకు పైగా విలువ చేసే జ్యూయలరీని కొనుగోలు చేసేందుకు పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
పాన్ కార్డ్ అంటే ఏమిటీ.. :
మనం సంపాదించే ఆదాయం ప్రభుత్వానికి చెల్లించే ఇన్‌కమ్ ట్యాక్స్ పరిమితిలో ఉంటే మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి పాన్ కార్డ్ అనేది అవసరం. కారణం మీ ఇన్‌కమ్ ట్యాక్స్‌లో మీ పాన్ కార్డ్ నెంబర్‌ను ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. పాన్ అంటే పర్మినెంట్ అకౌంట్ నెంబర్. మన పాన్ కార్డ్ అనేది పది డిజిట్లలో ఉంటుంది. ఆల్పా న్యూమరిక్ నెంబర్లను కలిగి ఉన్న ప్లాస్టిక్ లామినేటేడ్ కార్డును ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అందజేస్తుంది.