గడచిన ఆర్ధిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇన్పోసిస్ నికరలాభం 2.7 శాతం పడిపోయి రూ. 3,161.5 కోట్లకు చేరవచ్చని అంచవా వేస్తున్నారు.
ఇన్పోసిస్‌తో పాటు విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీ లాంటి సాప్ట్‌వేర్ దిగ్గజాలు కూడా అదే బాటలో నడుస్తాయని అంచనా వేస్తున్నారు. నాల్గవ త్రైమాసిక ఫలితాలను ఇన్పోసిస్ శుక్రవారం వెల్లడిస్తుండగా, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీలు మంగళవారం వెల్లడి చేయనున్నాయి.

దేశంలోని ఐదు బ్రోకరేజి సంస్ధలతో పాటు ఈటీ ఇంటిలిజెన్స్ గ్రూప్ సంస్ధ అంచనాల సరాసరి ప్రకారం ఇన్పోసిస్ నికర అమ్మకాలు 0.3 శాతం పెరిగి నికరలాభం రూ. 13,838 కోట్లకు చేరనున్నాయి. ఇక విప్రో ఆదాయం 0.1 శాతం తగ్గి రూ. 11,986.20 కోట్లకు చేరుతుందని, నికరలాభం 2.9 శాతం తగ్గి రూ. 2,139 కోట్లకు చేరుందని అంచనా వేశారు.
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆదాయం 1 శాతం తగ్గి రూ. 9,377.90 కోట్లకు, నికర లాభం 3.1 శాతం తగ్గి రూ. 1,856.50 కోట్లకు చేరవచ్చని అంచనా వేశారు. దీంతో ఈరోజు మార్కెట్లో ఇన్పోసిస్ ఈక్వీటీ 3 శాతానికి పైగా తగ్గింది. సోమవారం స్టాక్ మార్కెట్ల నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ 556 పాయింట్లు నష్టపోయి 27,886 పాయిట్ల వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications